2025 Champions Trophy Promo: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మైదానంలో కూల్‌గా ఉండేవాడు. ధోనీ రివ్యూ తీసుకున్నాడంటే అది పక్కాగా ఔట్ అని అందరూ ఫిక్స్ అవుతారు. అందుకే ఈ డీఆర్ఎస్ (డెసిషన్ రివ్యూ సిస్టమ్)ను క్రికెట్ ఫ్యాన్స్, ధోనీ రివ్యూ సిస్టమ్‌గా పిలుస్తుంటారు. అయితే ప్రస్తుతం 'ధోనీ రిఫ్రిజ్రేటర్ సిస్టమ్' (DRS) అని ట్రెండ్ అవుతోంది. దీనికి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రోమోనే కారణం.
ఫిబ్రవరి 19న ఈ మినీ మెగాటోర్నీ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టోర్నమెంట్ అధికారిక బ్రాడ్కాస్ట్ పార్ట్నర్ స్టార్ స్పోర్ట్స్ కొత్త ప్రోమో రిలీజ్ చేసింది. ధోనీతో రూపొందించిన ఈ ప్రోమో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. వీడియో ధోనీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఓ కెప్టెన్‌గా తాను ఎల్లప్పూడూ కూల్‌గానే ఉన్నానని చెప్పిన ధోనీ, ఇప్పుడు ఓ క్రికెట్ అభిమానిగా ఛాంపియన్స్ ట్రోఫీని కూల్‌గా చూడలేనని అన్నాడు.
'కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూల్‌గా ఉన్నా. కానీ, ఓ క్రికెట్ ఫ్యాన్‌గా ఛాంపియన్స్ ట్రోఫీని కూల్‌గా ఉంటూ చూడడం అయ్యే పని కాదు. మన జట్టు ఎంత పటిష్ఠంగా ఉన్నప్పటికీ, ఒక్క మ్యాచ్ ఓడినా టోర్నీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఈ టెన్షన్‌తో మంచులో ఉన్నా చాలా హాట్‌గా అనిపిస్తోంది' అంటూ ధోనీ వీడియోలో చెప్పుకొచ్చాడు.