Ind vs Ban T20 2024 :బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా 86 పరుగుల తేడాతో నెగ్గింది. మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన భారత్ ప్రత్యర్థిని మట్టికరిపించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కళ్లచెదిరే రీతిలో ఓ క్యాచ్ అందుకున్నాడు. అతడి క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
బంగ్లా ఇన్నింగ్స్‌లో 14వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వరుణ్ చక్రవర్తి బంతి అందుకున్నాడు. క్రీజులో ఉన్న రిషద్ హుస్సెన్ (9) ఆ ఓవర్ రెండో బంతిని భారీ షాట్ బాదాడు. ఇక డీప్ మిడ్వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న పాండ్య చురుగ్గా స్పందిచాడు. దాదాపు 25మీటర్లు పరిగెత్తి, సిక్స్ దిశగా వెళ్తున్న బంతిని సింగిల్ హ్యాండ్‌తో అందుకొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Ind W vs SL W T20 : మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ రెండో విజయం నమోదు చేసింది. బుధవారం శ్రీలంకతో తలపడ్డ టీమ్ఇండియా 82 పరుగుల తేడాతో నెగ్గింది. అయితే మహిళల వరల్డ్‌కప్‌లోనే అద్భుతమైన క్యాచ్‌ల్లో ఒకటి నమోదైంది. సబ్సిట్యూట్ ఫీల్డర్ రాధా యాదవ్ క్యాచ్ అందుకున్న తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
173 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంకకు తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. రేణుకా సింగ్ తొలి ఓవర్ బౌలింగ్ చేసింది. అయితే భారీ టార్గెట్ ఛేదనలో తొలి నుంచే ఎటాకింగ్ గేమ్ ఆడాలన్న ఆలోచనతో, రెండో బంతికే ఓపెనర్ విష్మి గుణరత్నే (0) క్రీజులోంచి బయటకు వచ్చి షాట్ బాదింది. దీంతో బంతి అమాంతం గాల్లోకి లేచింది. బ్యాక్వర్డ్ పాయింట్ వద్ద సబ్సిట్యూట్ ఫీల్డర్‌గా ఉన్న రాధా యాదవ్, బంతిని అందుకునేందుకు రివర్స్‌లో పరిగెత్తింది. ఏ మాత్రం బంతిపైనుంచి చూపు మరల్చకుండా అలాగే పరిగెత్తి క్యాచ్ అందుకుంది. దీంతో ప్రేక్షులుకు అవాకయ్యారు.
ప్రస్తుతం ఈ వీడియో వైరలైంది. మహిళల వరల్డ్‌కప్‌లో అద్భుతమైన క్యాచ్‌ల్లో ఇదీ ఒకటి అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. '2023 వన్డే ఫైనల్లో ట్రావిస్ హెడ్లాగే క్యాచ్ పట్టింది' అని మరికొందరు అంటున్నారు.