తెలంగాణ

telangana

ETV Bharat / sports

హార్దిక్​కు గ్రాండ్ వెల్​కమ్​ - అభిమానులు ఏం చేశారంటే? - Hardik Pandya T20 World Cup 2024 - HARDIK PANDYA T20 WORLD CUP 2024

Hardik Pandya Grand Welcome : టీ20 ప్రపంచకప్​ గెలిచిన ఆనందంలో తన సొంత ఊరికి వచ్చిన స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యాకు వడోదర ప్రేక్షకులు గ్రాండ్ వెల్​కమ్​ పలికారు. ఆ వీడియోను మీరూ చూసేయండి.

Hardik Pandya Grand Welcome
Hardik Pandya (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jul 16, 2024, 8:30 AM IST

Hardik Pandya Grand Welcome :తాజాగా జరిగిన టీ 20 ప్రపంచకప్​లో టీమ్ఇండియా జయకేతనం ఎగురవేసి ఎంతో మంది క్రికెటర్ల కల నెరవేర్చింది. దీంతో అటు ప్లేయర్లు కూడా క్రికెట్ అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. పాత రోజులు గుర్తు చేసుకుని ఓ వైపు కంటతడి పెడుతూనే, మరోవైపు ఈ సూపర్ విక్టరీని సెలబ్రేట్​ చేసుకున్నారు.

ఇక బార్బొడస్​ నుంచి దిల్లీ చేరుకున్న రోహిత్ సేనకు ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. ఎయిర్​పోర్ట్​కు పెద్దఎత్తున తరలి వచ్చి సందడి చేశారు. ఇక ఐటీసీ హోటల్ వద్ద కూడా ఓ రేంజ్​లో వెల్​కమ్​ పలికారు. ఇదే కాకుండా ముంబయిలో జరిగిన విక్టరీ పరేడ్​, అలాగే వాంఖడే వేదికగా జరిగిన సత్కారంతో టీమ్​ఇండియాకు మరపురాని మెమరీస్​ను అందించారు క్రికెట్ అభిమానులు.

అయితే తమ సొంత ఊర్లకు వెళ్లిన క్రికెట్ ప్లేయర్లకు అక్కడి వారు గ్రాండ్​గానే వెల్​కమ్​ చెప్పారు. ఇటీవలే హైదరాబాద్​లోనూ మహ్మద్ సిరాజ్​ కోసం ఓ గ్రాండ్ రోడ్ షో ఏర్పాటు చేశారు ఆ ప్రాంతం వారు. అంతే కాకుండా శివమ్ దుబె ఇలా పలువురు స్టార్స్​ను తమ సొంత ప్రాంతాల వారు ఆత్మీయంగా ఆహ్వానించారు.

ఈ నేపథ్యంలో తాజాగా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యాకు కూడా తన సొంతఊరు అయిన వడోదరలో ఘన స్వాగతం లభించింది. తమ అభిమాన క్రికెటర్​ను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ఫ్యాన్స్, ఎయిర్‌పోర్ట్‌ నుంచి ర్యాలీగా తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేశారు. దీంతో ఓపెన్ బస్​లో అందరికీ అభివాదం చేస్తూ తన ఇంటికి చేరుకున్నాడు హార్దిక్. ఇక ఈ ర్యాలీ తర్వాత అదే వడోదరలో హార్దిక్‌కు సన్మానం ఏర్పాటు చేశారు. ఈ వీడియోను పాండ్యా తన సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​లో షేర్ చేశాడు. తనకోసం ఈ ఏర్పాటు చేసిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.

ఇక టీ20 వరల్డ్​కప్​ మ్యాచుల్లో తన బౌలింగ్‌తో అద్భుతంగా ఆడాడు. 11 వికెట్లు పడగొట్టాడు. బ్యాట్​తోనూ మెరుపులు మెరిపించాడు. అయితే హార్దిక్ తన క్రికెట్ కెరీర్​లో ఇప్పటి వరకూ మొత్తం 11 టెస్టులు, 86 వన్డేలు, 100 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

అగ్రస్థానాన్ని కోల్పోయిన హార్దిక్​ - అదరగొట్టిన గైక్వాడ్​, అభిషేక్ శర్మ - ICC Latest T20 Rankings

సంగీత్ సెలబ్రేషన్స్​లో స్పెషల్ మూమెంట్ - వరల్డ్ కప్​ విన్నర్స్​కు దిష్టి తీసిన నీతా అంబానీ - Nita Ambani Praises Rohith Sharma

ABOUT THE AUTHOR

...view details