Hardik Pandya Captain IPL:హైదరాబాద్ ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో ముంబయి ఓడిపోవడం వల్ల కెప్టెన్ హార్దిక్ పాండ్యపై మళ్లీ విమర్శలు చెలరేగుతున్నాయి. హార్దిక్ సారథ్యంపై మరోసారి సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కువవుతున్నాయి. హార్దిక్ పాండ్య కెప్టెన్సీపై నెటిజన్లు మండిపడుతున్నారు. ముంబయి బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్లలో 36 పరుగులు ఇవ్వగా, స క్వీనా మఫాకా 4 ఓవర్లలో 66 పరుగులు సమర్పించుకున్నాడు. 4 ఓవర్లు వేసిన హార్దిక్ పాండ్య 46 పరుగులు ఇచ్చాడు. అయితే కెప్టెన్‌గా ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రాను హార్దిక్ పాండ్య ఉపయోగించిన తీరుపై నెటిజన్లు, ముంబయి ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
బుమ్రాకు ఒక్క ఓవరేనా?:పవర్ ప్లేలో స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ భీకరంగా ఆడుతున్న బుమ్రాకు బంతి ఇవ్వలేదని పాండ్యను నెటిజన్లు తప్పుపడుతున్నారు. హార్దిక్ పాండ్య పేలవమైన కెప్టెన్సీ కారణంగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు చేసిందని మండిపడుతున్నారు. ఈ మ్యాచ్ తొలి 11 ఓవర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 160+ పరుగులు చేసింది. ఆ సమయంలో బుమ్రాను కెప్టెన్ సరిగ్గా వినియోగించుకోలేదని ఫైర్ అవుతున్నారు. తొలి 11 ఓవర్లలో బుమ్రాకు కేవలం ఒక ఓవర్ బౌలింద్ ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఉప్పల్‌లో పరుగుల వర్షం కురిపించిన బ్యాటర్లు బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడలేక ఇబ్బంది పడ్డారని గుర్తు చేస్తున్నారు.
బ్యాటింగ్‌లోనూ విఫలమే:కొండత లక్ష్యం కళ్ల ముందుండగా ఓపెనర్లు రోహిత్, ఇషాన్ కిషన్ ముంబయికి మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ఈ ఆరంభాన్ని మిడిలార్డర్లో తిలక్ వర్మ, నమన్ దీర్ చక్కగా ఉపయోగించుకొని విజయంపై ఆశలు రేపారు. హార్దిక్ బ్యాటింగ్‌కు వచ్చే సమయంలో ముంబయి 10 ఓవర్లలో 150 పరుగులు చేసి పటిష్ఠ స్థితిలో ఉంది. ఆ సమయంలో హార్దిక్ ఇన్నింగ్స్‌ను ధాటిగానే ఆరంభించినా దాన్ని కొనసాగించడంలో విఫలమయ్యాడు. పాండ్య- తిలక్ వర్మ జోడీ 34 బంతుల్లో 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినా అందులో పాండ్యవి 19 పరుగులే.