Gukesh World Champion :2024 ఫిడే చెస్ ఛాంపియన్‌షిప్‌లో యంగ్ ప్లేయర్ గుకేశ్ ఓ అరుదైన రికార్డును నమోదు చేశాడు. తాజాగా జరిగిన చివరి సమ్మిట్ గేమ్‌లో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించాడు. ఈ క్రమంలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా గుకేశ్ చరిత్రకెక్కాడు. 2012 తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్న తొలి భారతీయుడు కూడా గుకేశ్ కావడం విశేషం.
గేమ్ ఎలా సాగిందంటే?
గురువారం జరిగిన 14వ రౌండ్‌లో ఎంతో ఉత్కంఠగా సాగిన గేమ్‌లో చివరికి గుకేశ్ విజయాన్ని సాధించాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్‌ను సొంతం చేసుకున్న రెండో ఆటగాడిగా ఈ యంగ్ ప్లేయర్ చరిత్రకెక్కాడు. అయితే వాస్తవానికి బుధవారమే ఈ ఫలితం తేలాల్సింది. అయితే సుమారు 5 గంటల పాటు సాగిన 13వ రౌండ్‌లో ప్రత్యర్థులిద్దరూ చెరో పాయింట్‌ను పంచుకుఉన్నారు. కానీ విజయం కోసం 18 ఏళ్ల గుకేశ్ గట్టిగానే ప్రయత్నించినప్పటికీ 32 ఏళ్ల లిరెన్ చాలా కూల్‌గా ఆడి ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. దీంతో 68 ఎత్తుల తర్వాత ఇద్దరు ప్లేయర్లు ఫలితం తేలకుండానే గేమ్ ముగించేందుకు అంగీకరించారు. మరోవైపు గురువారం జరిగిన 14వ రౌండ్‌లో విజయంతో ఒక పాయింట్ సాధించిన గుకేశ్ విజేతగా నిలిచాడు.
10 ఏళ్ల కల - ఇప్పుడు నిజమైంది!
మరోవైపు చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకున్న తర్వాత గుకేశ్ మీడియాతో మాట్లాడాడు. ఓ వైపు ఆనందం వ్యక్తం చేస్తూనే మరోవైపు ఎమోషనల్ అయ్యాడు. గత 10 ఏళ్లుగా ఈ క్షణం కోసం కలలు కంటున్నానని పేర్కొన్నాడు. ఇప్పుడీ కలను సాకారం చేసుకున్నందుకు సంతోషంగా ఉందని అన్నాడు.