Sangareddy Jailer Suspension : లగచర్ల రైతుకు బేడీల ఘటనలో సంగారెడ్డి జైలర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. గుండెనొప్పి వచ్చిన హీర్యానాయక్‌కు బేడీలు వేసి ఆస్పత్రికి పోలీసులు తీసుకువెళ్లిన ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. హీర్యానాయక్‌కు బేడీల ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో సంగారెడ్డి సెంట్రల్ జైలులో హీర్యానాయక్ బేడీల ఘటనపై విచారణ ముగిసింది. వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల ఎస్పీలతో కలిసి జైలు సిబ్బందిని నాలుగు గంటల పాటు ఐజీ సత్యనారాయణ విచారించారు.
"సంగారెడ్డి సెంట్రల్ జైలు సిబ్బంది తప్పిదం వల్లే రైతుకు బేడీలు. జైలు అధికారులు వికారాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. నేరుగా సైబరాబాద్ పోలీసులకు సమాచారమిచ్చారు. హీర్యానాయక్‌ను లగచర్ల కేసులో నిందితుడిగా పేర్కొనలేదు. బాలానగర్‌లోని ఓ కేసులో నిందితుడిగా హీర్యానాయక్‌ను పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా చేశారా.. పొరపాటు జరిగిందా అనే కోణంలో దర్యాప్తు సాగింది. ఏ2 సురేష్ జైల్లో నుంచి ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడారు. హీర్యానాయక్‌కు గుండె నొప్పి అని చెబితే బెయిల్ వస్తుందని సురేష్ చెప్పారు. సురేష్ ఎవరితో మాట్లాడరన్న దానిపై ఆరా తీస్తున్నాం. హీర్యానాయక్ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై చర్యలు తప్పవు"- సత్యనారాయణ, ఐజీ
బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చింది? - సీఎం రేవంత్ సీరియస్