Champions Trophy 2025 Major Change : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌కు ఎట్టి పరిస్థితుల్లో భారత జట్టును పంపబోమని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు, టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించే విషయంపై పీసీబీ తన స్పష్టమైన వైఖరిని ఇప్పటికీ అధికారికంగా తెలియజేయలేదు.
దీంతో ఇప్పటికీ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఖరారు కాలేదు. పైగా టోర్నీకి సమయం దగ్గర పడుతున్నందున మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నామని ప్రసారకర్తలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో మెగా టోర్నీని టీ20 ఫార్మాట్లో నిర్వహించాలని ఐసీసీకి ప్రతిపాదనలు వచ్చినట్లు క్రిక్‌బజ్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. వన్డే ఫార్మాట్ కన్నా టీ20లకు ఆదరణ ఎక్కువ లభిస్తుండడం వల్ల పొట్టి ఫార్మాట్లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించాలనే యోచనలో ఐసీసీ కూడా ఉన్నట్లు సమాచారం.
"ప్రతిష్టంభన కొనసాగితే ఛాంపియన్స్ ట్రోఫీని టీ20 ఫార్మాట్‌గా మార్చాలని కొంతమంది వాటాదారులు కోరే అవకాశం ఉంది. వన్డేలకు రానురాను ఆదరణ తగ్గిపోతుంది. టోర్నీని టీ20 ఫార్మాట్‌గా మార్చితే సులభంగా, వేగంగా మార్కెటింగ్ చేసుకోవచ్చు" అని క్రికెట్ సంబంధిత వర్గాలు తెలిపాయి.
కోహ్లీ, రోహిత్‌కు షాక్!
మార్కెటింగ్ వంటి ఆర్థిక పరమైన ఇబ్బందుల కారణంగా టీ20 ఫార్మాట్లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ ప్లేయర్లకు బిగ్ షాక్ తగలుతుంది!. ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచి మరో ఐసీసీ ట్రోఫీని ముద్దాడాలనుకున్న వాళ్ల ఆశలకు బ్రేక్ పడుతుంది. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ 2024 విజయానంతరం ఈ ఇద్దరూ పొట్టి ఫార్మాట్‌కు. రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో వాళ్లు ఛాంపియన్స్ ట్రోఫీని ఆడే అవకాశం ఉండకపోవచ్చు!
ఐసీసీ నిర్ణయంపై ఉత్కంఠ
కాగా, వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. తాము ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికలకు మార్చి హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీని నిర్వహించాలని ఐసీసీకి బీసీసీఐ స్పష్టం చేసింది. పాకిస్థాన్ కూడా హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరిస్తుందనే అంతా అనుకుంటున్నారు. అయితే, భవిష్యత్తులో భారత్‌లో జరిగే ఐసీసీ ఈవెంట్లలో తమ మ్యాచ్‌లకూ ఇదే మోడల్‌ను అనుసరించాలని ఇప్పటికే పాక్ బోర్డు, ఐసీసీ దృష్టికి తీసుకొచ్చింది. దీనిపై ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
కోహ్లీ IPL ప్రత్యర్థి చెత్త రికార్డు - ఒకే ఓవర్లో 13 బంతులు - జట్టు ఓటమి!
కుంబ్లే, హర్భజన్ కన్నా అతడి బౌలింగ్‌లోనే కీపింగ్ చేయడం కష్టం! : ధోనీ