ETV Bharat / offbeat

దాబా స్టైల్ "తందూరీ ఎగ్​ కర్రీ"- అన్నం, చపాతీల్లోకి సూపర్ కాంబో - ఇలా ప్రిపేర్ చేయండి!

-మళ్లీ మళ్లీ తినాలనిపించే తందూరీ ఎగ్​ కర్రీ - సరికొత్త టేస్ట్​ను ఎంజాయ్ చేయండి

Dhaba Style Tandoori Egg Curry
Dhaba Style Tandoori Egg Curry (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Dhaba Style Tandoori Egg Curry : ఇంట్లో రొటీన్​గా చేసే ఎగ్​ కర్రీ.. అంత స్పెషల్​గా అనిపించదు. ఇష్టంగా తినాలనిపించదు. అందుకే.. ఈసారి దాబా స్టైల్లో తందూరీ ఎగ్​ కర్రీ ట్రై చేయండి. ఈ స్టోరీలో చెప్పిన విధంగా ఎగ్​ కర్రీ చేస్తే.. చపాతీ, పూరీ, అన్నంలోకి టేస్ట్​ అద్దిరిపోతుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా దాబా స్టైల్​ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు? తయారీ విధానం ఏంటో ఓ లుక్కేయండి..

కావాల్సిన పదార్థాలు :

  • గుడ్లు - 6
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • బార్బెక్యూ స్కేవర్స్ స్టిక్స్​-3

టమాటా ప్యూరీ కోసం..

  • ఉల్లిపాయ - 1
  • టమాటాలు - 3
  • పచ్చిమిర్చి-3
  • దాల్చిన చెక్క- ఇంచ్​
  • యాలకలు-2
  • లవంగాలు-3
  • మిరియాలు-10
  • వెల్లుల్లి రెబ్బలు-8
  • అల్లం -చిన్న ముక్క
  • ధనియాలు-అరటేబుల్​స్పూన్
  • ఎండు మిర్చి-2
  • జీలకర్ర -అరటీస్పూన్​
  • కొబ్బరి పొడి-2 టేబుల్​స్పూన్లు

ఎగ్స్​ మిశ్రమం కోసం..

  • నూనె-టేబుల్​స్పూన్​
  • కొద్దిగా ఉప్పు
  • పసుపు చిటికెడు
  • కారం-అరటీస్పూన్​
  • గరం మసాలా-పావు టీస్పూన్
  • వేపిన జీలకర్ర పొడి-పావు టీస్పూన్
  • కశ్మీరి చిల్లీ పౌడర్​- అరటీస్పూన్​
  • శనగపిండి-టేబుల్​స్పూన్
  • కసూరి మేథి- టీస్పూన్‌
  • పెరుగు -3 టేబుల్​స్పూన్లు

తయారీ విధానం :

  • ముందుగా స్టౌపై ఒక పాత్ర పెట్టుకొని నీళ్లతో పాటు కొద్దిగా ఉప్పు వేసుకొని గుడ్లను ఉడికించుకోవాలి. అవి ఉడికాక వాటిని పొట్టు తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
  • ఎగ్స్​ ఉడికేలోపు రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలను శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. అలాగే.. కొత్తిమీర సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు ఒక మిక్సింగ్​ బౌల్లోకి నూనె, ఉప్పు, గరం మసాలా, కారం, వేపిన జీలకర్ర పొడి, కశ్మీరి చిల్లీ పౌడర్, శనగపిండి, పసుపు, పెరుగు, కసూరీ మేథి చేతితో నలిపి వేసుకోండి. ఈ మిశ్రమాన్ని బాగా కలపండి.
  • ఇందులో ఉడికించుకున్న ఎగ్స్​ వేసి బాగా కలపండి. గుడ్లకు మసాలా బాగా పట్టాలి.
  • ఇప్పుడు అరగంటపాటు నీటిలో నానబెట్టుకున్న బార్బెక్యూ స్కేవర్స్​కి(Barbecue Skewers) ఎగ్స్​ గుచ్చండి. (ఒక స్టిక్​కి రెండు ఎగ్స్ గుచ్చండి)
  • తర్వాత స్టౌ ఆన్​ చేసి మీడియం ఫ్లేమ్​లో గుడ్లను 5 నిమిషాల సేపు కాల్చుకోండి. గుడ్లకు పట్టించిన మసాలా ఎర్రగా పూర్తిగా ఎండిపోయి కాలాలి.
  • ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టి ఆయిల్​ పోయండి. నూనె వేడయ్యాక దాల్చిన చెక్క, మిరియాలు, యాలకలు, లవంగాలు వేసి వేపండి. ఆపై ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారే వరకు వేపండి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, అల్లం, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి.
  • తర్వాత టమాటా ముక్కలు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసి కలపండి.
  • టమాటాలు మెత్తబడిన తర్వాత కొబ్బరి పొడి వేసి మిక్స్​ చేయండి. ఇప్పుడు స్టౌ ఆఫ్​ చేసి మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి.
  • ఆపై ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇందులో కొన్ని నీళ్లు పోసుకుని మెత్తగా పేస్ట్​లాగా గ్రైండ్​ చేసుకోండి.
  • తర్వాత అదే కడాయిలో కాస్త ఆయిల్​ పోయండి. నూనె వేడయ్యాక జీలకర్ర వేసి వేపండి.
  • ఇప్పుడు గ్రైండ్​ చేసుకున్న టమాటా ప్యూరీ వేసుకోండి. ఇందులో కప్పు నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని 10 నిమిషాలు ఉడికించుకోండి.
  • తర్వాత కాల్చుకున్న మసాలా ఎగ్స్​ వేసి కలపండి. ఇప్పుడు స్టౌ మీడియం ఫ్లేమ్​లో అడ్జస్ట్​ చేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోండి.
  • ఆపై కాస్త కొత్తిమీర తరుగు చల్లి స్టౌ ఆఫ్​ చేయండి. అంతే ఇలా చేసుకుంటే ఘుమఘుమలాడే దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ మీ ముందుంటుంది.
  • నచ్చితే ఈ రెసిపీ ఓసారి ఇంట్లో ప్రయత్నించండి.

ఇవి కూడా చదవండి :

ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లో తింటే డేంజర్ - ఇంట్లోనే "ఎగ్​ నూడుల్స్​" ఇలా చేసుకోండి!

అన్నం, పులావ్‌, రోటీలకు మంచి కాంబినేషన్‌ - టేస్టీ "పాలక్ ఎగ్ కర్రీ" - ఈజీగా చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.