How to Make Paneer Fried Rice : పనీర్‌తో బిర్యానీ, ఫ్రై, మసాలా కర్రీ ఇలా ఏ రెసిపీలు చేసినా ఎంతో రుచిగా ఉంటాయి. అయితే పనీర్‌తో ఎప్పుడూ చేసే వంటలే కాకుండా.. ఈ సారి కొత్తగా "పనీర్ ఫ్రైడ్ రైస్" ట్రై చేద్దాం. ఒక్కసారి ఈ పద్ధతిలో ఫ్రైడ్ రైస్ చేస్తే రెస్టారెంట్ టేస్ట్‌లో అద్దిరిపోతుంది. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- బాస్మతి రైస్-గ్లాసు (150 గ్రాములు)
- క్యారెట్-1
- ఉల్లిపాయ-1
- పచ్చిమిర్చి-2
- క్యాబేజీ తరుగు- పావుకప్పు
- నూనె- సరిపడా
- ఉప్పు-రుచికి సరిపడా
- బీన్స్-5
- కారం-టీస్పూన్
- ధనియాల పొడి-టీస్పూన్
- గరం మసాలా -అరటీస్పూన్
- జీలకర్రపొడి-అరటీస్పూన్
- మిరియాలపొడి-అరటీస్పూన్
- సోయా సాస్-టేబుల్‌స్పూన్
- వెనిగర్-టేబుల్‌స్పూన్
- కొత్తిమీర తరుగు
పనీర్ ఫ్రై చేయడం కోసం..
- పనీర్-100 గ్రాములు
- ఫుడ్ కలర్ చిటికెడు
- కారం-టీస్పూన్
- గరం మసాలా -పావు టీస్పూన్
- ధనియాల పొడి-పావు టీస్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్ట్-టీస్పూన్
- కార్న్‌ఫ్లోర్-2 టేబుల్‌స్పూన్లు
- మైదా పిండి-2 టేబుల్‌స్పూన్లు
- నూనె సరిపడా
- వెల్లుల్లి రెబ్బలు-4
తయారీ విధానం :
- ముందుగా ఒక రెండుసార్లు బాస్మతి బియ్యాన్ని కడిగి ఒక అరగంటపాటు నానబెట్టుకోవాలి.
- ఈ లోపు రెసిపీలోకి పనీర్ చిన్న క్యూబ్స్ మాదిరి కట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యాబేజీ సన్నగా కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు రైస్ ఉడికించుకోవడం కోసం స్టౌ పై గిన్నె పెట్టండి. ఇందులో 4 గ్లాసుల నీరు, కొద్దిగా నూనె, ఉప్పు వేయండి. నీరు బాగా మరుగుతున్నప్పుడు రైస్ వేయండి.
- రైస్ ఉడికిన తర్వాత గంజి వంపి పక్కన పెట్టుకోండి.
- ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి పనీర్ ముక్కలు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ఆపై కార్న్‌ఫ్లోర్, మైదా పిండి, ఫుడ్ కలర్ వేసి కలపండి. ఇప్పుడు కొన్ని నీళ్లు యాడ్ చేసి పనీర్ ముక్కలకు పిండి బాగా పట్టేలా కలపండి.
- ఇప్పుడు పనీర్ ఫ్రై చేయడం కోసం.. స్టౌపై కడాయి పెట్టి ఆయిల్ పోయండి.
- నూనె వేడయ్యాక స్టౌ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి పనీర్ ముక్కలను ఒక్కోటిగా వేసుకోండి.
- పనీర్ ముక్కలు క్రిస్పీగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోండి.
- ఇప్పుడు పనీర్ ఫ్రై రైస్ చేయడానికి స్టౌపై పాన్ పెట్టండి. ఇందులో 2 టేబుల్స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేయండి. ఆపై వెల్లుల్లి తరుగు వేసి ఫ్రై చేయండి.
- అనంతరం ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించండి.
- ఇప్పుడు స్టౌ హై ఫ్లేమ్‌లో పెట్టి క్యారెట్, బీన్స్ ముక్కలు, క్యాబేజి తురుము వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి.
- అనంతరం ఫ్రై చేసుకున్న పనీర్ ముక్కలు వేసి కలపండి.
- తర్వాత ఉడికించుకున్న అన్నం వేసి మిక్స్ చేయండి. ఆపై కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్రపొడి, మిరియాలపొడి, ఉప్పు వేసుకుని బాగా కలపండి.
- మసాలాలు రైస్‌కి పట్టిన తర్వాత సోయా సాస్, వెనిగర్ వేసి మిక్స్ చేయండి. స్టౌ ఆఫ్ చేసే ముందు కాస్త కొత్తిమీర తరుగు చల్లుకుని మిక్స్ చేయండి.
- అంతే ఇలా చేస్తే టేస్టీ పనీర్ ఫ్రైడ్ రైస్ మీ ముందుంటుంది. నచ్చితే ఈ విధంగా ఫ్రైడ్ రైస్ ఇంట్లో ట్రై చేయండి.
ఇవి కూడా చదవండి: