ETV Bharat / sports

రూట్​ మార్చిన టీమ్ఇండియా - రోహిత్ ఈ సారి ఏ ఆర్డర్​లో వస్తాడంటే?

అడిలైట్​లో బెడిసికొట్టిన వ్యూహం - బ్రిస్బేన్‌ టెస్ట్‌ కోసం టీమ్ఇండియా సూపర్ ప్లాన్​ - రోహిత్ ఏం చేయనున్నాడంటే?

Rohit Sharma Border Gavaskar Trophy
Rohit Sharma (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : 2 hours ago

Rohit Sharma Border Gavaskar Trophy : గత మ్యాచ్​లో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు చేసి ఘోరా విఫలాన్ని చవి చూసిన టీమ్ఇండియా ఈ సారి తమ ప్లాన్​లో ఛేంజస్​ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి రోహిత్‌ శర్మ కీలక సంకేతాలు పంపినట్లు కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అతడి స్థానం మరికొంత పైకి జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా నెట్స్‌ సెషన్‌లో జరిగిన మార్పులే దీనికి సంకేతమని క్రిటిక్స్ అంటున్నారు.

సాధారణంగా కొత్త బంతిని ఎదుర్కొనేందుకు నెట్స్‌లో ఓపెనర్లు వస్తుంటారు. అయితే బ్రిస్బేన్‌లో తాజాగా జరిగిన సెషన్‌లలో రోహిత్‌ కూడా బంతి మెరుపు కోల్పోని సమయంలోనే ప్రాక్టీస్​ చేశాడు. సిరాజ్‌, బుమ్రా, ఆకాశ్‌దీప్‌లు రోహిత్​కు బౌలింగ్‌ చేశారు. దీంతోపాటు జైస్వాల్‌, జడేజాతో కొన్ని విషయాల గురించి చర్చించాడట. మరోవైపు విరాట్‌ కూడా ఎక్కువసేపు నెట్స్‌ సెషన్‌లో పాల్గొన్నాడని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ఈ సెషన్స్‌ మొత్తం తన కోచింగ్‌ బృందంతో కలిసి పర్యవేక్షించాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌. అయితే ఆ సమయంలో ఆయన విరాట్‌తో ఏదో విషయం గురించి సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జట్టు మొత్తం ఫీల్డింగ్‌ డ్రిల్స్‌ చేసింది.

అయితే రోహిత్‌ టెస్ట్‌ల్లో బ్యాటింగ్‌కు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాడు. గత 12 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క అర్ధశతకం మాత్రమే నమోదు చేయగలిగాడు. మిగతా ఎనిమిది సార్లు పది పరుగుల్లోపే చేశాడు. పర్సనల్ కారణాల వల్ల ఆస్ట్రేలియా సిరీస్‌ తొలి టెస్ట్‌లో అతడు ఆడలేకపోయాడు. దీంతో జైస్వాల్, రాహుల్‌ ఆ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. వారిద్దరూ మ్యాచ్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే రెండో టెస్ట్‌ కోసం ఈ జంటను కొనసాగించి రోహిత్‌ 6వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. అయితే అప్పుడు అతడు ఘోరంగా విఫలం అయ్యాడు.

అటు రాహుల్‌ కూడా పెద్దగా మెరుపులు సృష్టించలేకపోయాడు. దీంతో రానున్న మ్యాచ్​లో సీమర్లకు స్వర్గధామమైన గబ్బా మైదానంలో రోహితే ఇన్నింగ్స్‌ను ప్రారంభించవచ్చని ప్రచారం జరుగుతోంది. సీమర్లను ఎదుర్కోవడంలో అతడికి ఉన్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని జట్టు ఈ వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే సుమారు 30 ఏళ్లకు పైగా ఆసీస్‌కు ఓటమనేదే లేకుండా కొనసాగిన మైదానం గబ్బా. ఈ రికార్డును 2021లో రిషభ్‌ పంత్‌ అద్భుతమైన బ్యాటింగ్‌తో బద్ధలు కొట్టాడన్న సంగతి మన అందరికీ తెలిసిందే. చూడాలి మరి ఈ సారి మనోళ్ల వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో!

కోహ్లీ, రోహిత్​కు బిగ్ షాక్! - ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫార్మాట్​లో భారీ మార్పు!

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్​ - 6 ఏళ్ల తర్వాత రోహిత్ శర్మ డౌన్!, కోహ్లీ ర్యాంక్ ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.