Virat Kohli Border Gavaskar Trophy : టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. దీంతో అభిమానులు, క్రీడా ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ కొట్టినప్పటికీ, మిగతా మూడు ఇన్నింగ్స్‌ల్లో ఘోర విఫలాన్ని చవి చూశాడు. ఆఫ్ స్టంప్ మీద పడిన బంతిని వెంటాడుతూ వికెట్ల వెనుకే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పడుతున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా గడ్డపై తిరుగులేని రికార్డును తన ఖాతాలో వేసుకున్న విరాట్ తనకున్న బలహీనతను అధిగమించి మునుపటి ఫామ్‌ను అందుకోవాలంటూ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
మరోవైపు 36 ఏళ్ల ఈ స్టార్ బ్యాటర్‌కు బహుశా ఇదే చివరి ఆసీస్ పర్యటన కావొచ్చంటూ క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే రానున్న మ్యాచ్‌లో విరాట్ సచిన్ తెందూల్కర్ కూడా సాధించలేకపోయిన ఓ అరుదైన రికార్డును సాధించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఒకవేళ ఇప్పుడు మిస్ అయితే మళ్లీ ఆ ఛాన్స్ రాకపోవచ్చని అంటున్నారు. అదేంటంటే?
ఆ సెంచరీతోనే సాధ్యం!
అయితే డిసెంబరు 14 నుంచి గబ్బా వేదికగా మూడో టెస్టు జరగనుంది. ఈ టోర్నీలో ఆసీస్‌పై శతకం బాదితే ఓ అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంటాడు విరాట్. ఆస్ట్రేలియాలోని ఐదు మెయిన్ స్టేడియాల్లో సెంచరీలు బాదిన చేసిన మూడో ఇంటర్నేషనల్ ప్లేయర్‌గా రికార్డుకెక్కుతాడు. ఇప్పటివరకు ఈ ఘనత లెజెండరీ క్రికెటర్ సునీల్ గావస్కర్, అలిస్టర్ కుక్ పేరిట మాత్రమే ఉంది. అయితే గావస్కర్ 1977లో బ్రిస్బేన్, పెర్త్, మెల్‌బోర్న్ 1985లో అడిలైడ్, సిడ్నీలో సెంచరీలు సాధించాడు.
ఇక ఇంగ్లాండ్ మాజీ బ్యాటర్ అలిస్టర్ కుక్ 2006లో పెర్త్ స్టేడియంలో, అలాగే 2010-11లో బ్రిస్బేన్, అడిలైడ్, సిడ్నీ స్టేడియాల్లో శతకాలు బాదాడు. 2017లో కుక్ మెల్‌బోర్న్‌లో మూడంకెల సాధించి గావస్కర్ సరసన నిలిచాడు. అయితే కోహ్లీ ఇప్పటివరకు టెస్టుల్లో ఏడు శతకాలు నమోదు చేశాడు. అడిలైడ్‌లో మూడు సెంచరీలు (2012లో ఒకటి, 2014లో రెండు), అలాగే పెర్త్‌లో ఓ రెండు సెంచరీలు (2018, 2024), ఇక మెల్‌బోర్న్‌లో (2014), సిడ్నీలో (2015)లోనూ ఒక్కో శతకం బాదాడు.
'ఆ స్ఫూర్తి ఎటు పోయింది- రోహిత్, విరాట్ ఇది మీరేనా?'
'10 ఏళ్ల నుంచి అది తినడమే మానేశాడు' - కోహ్లీ ఫిట్‌నెస్‌పై అనుష్క శర్మ!