తెలంగాణ

telangana

ETV Bharat / sports

చెన్నైకి చెక్ - సొంత మైదానంలో గుజరాత్ సూపర్ విక్టరీ - IPL 2024 - IPL 2024

GT vs CSK IPL 2024: అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్- చెన్నై తలపడ్డాయి. ఈ హై స్కోరింగ్ మ్యాచ్​లో గుజరాత్ గెలుపొందింది. దీంతో 35 పరుగుల తేడాతో గుజరాత్‌ చేతిలో చెన్నై ఓటమి చవి చూసింది.

GT vs CSK IPL 2024
GT vs CSK IPL 2024 (Source: Associated Press)

By ETV Bharat Telugu Team

Published : May 10, 2024, 10:58 PM IST

Updated : May 11, 2024, 6:28 AM IST

GT vs CSK IPL 2024:2024 ఐపీఎల్​లో నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్​ కింగ్స్-​ గుజరాత్ టైటాన్స్ జట్లు శుక్రవారం తలపడ్డాయి. ఈ మ్యాచ్​లో చెన్నై జట్టును గుజరాత్ 35 పరుగుల తేడాతో ఓడించింది. ఛేదనలో మోహిత్‌శర్మ (3/31), రషీద్‌ఖాన్‌ (2/38) విజృంభించడం వల్ల చెన్నై జట్టు 20 ఓవర్లలో 196/8కే పరిమితమైంది. మిచెల్‌ (63), మొయిన్‌ అలీ (56) రాణించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

మ్యాచ్ సాగిందిలా :
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ ప్రత్యర్థి చెన్నై ముందు 232 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే భారీ ఛేజింగ్​లో చెన్నైకి పేలవ ఆరంభం లభించింది. రెండు పరుగులకే ఓపెనర్లిద్దరూ అజింక్యా రహానే (1), రచిన్ రవీంద్ర (1) పెవిలియన్ చేరారు. వన్​డౌన్​లో వచ్చిన కెప్టెన్ రుతురాజ్ (0) పరుగుల ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. దీంతో చెన్నై 10 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన మోయిన్ అలీ (56 పరుగులు, 36 బంతుల్లో)తో కలిసి డారిల్ మిచెల్ (63 పరుగులు, 34 బంతుల్లో) ఇన్నింగ్స్​ను చక్కదిద్దాడు.

ఈ క్రమంలో వీరిద్దరూ హాఫ్ సెంచరీలు కంప్లీట్ చేసుకున్నారు. ఇక 12.2 వద్ద మోహిత్ శర్మ బౌలింగ్​లో భారీ షాట్​కు ప్రయత్నించిన మిచెల్ క్యాచౌట్​గా పెలివియన్ చేరాడు. వీరిద్దరూ నాలుగో వికెట్​కు 109 పరుగుల జోడించి, విజయంపై ఆశలు రేపారు. ఇక 14.2 వద్ద మొయిన్ అలీని కూడా మోహిత్ శర్మే వెనక్కుపంపి గుజరాత్​కు బ్రేక్ ఇచ్చాడు. దీంతో చెన్నై జట్టు 15 ఓవర్లకు 143/5తో నిలిచింది. ఈ స్థితిలో శివమ్‌ దూబె (21), జడేజా (18) ధాటిగా ఆడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఎనిమిదో స్థానంలో దిగిన ధోని (26) ఆఖరిలో అభిమానుల్లో ఆనందాన్ని నింపాడు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 231-3 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఓపెనర్లు శుభ్​మన్ గిల్ (104 పరుగులు, 55 బంతుల్లో; 5x4, 7x6), సాయి సుదర్శన్ (103 పరుగులు, 51బంతుల్లో; 9x4, 6x6) శతకాలతో చెలరేగారు. ఇద్దరు కలిసి తొలి వికెట్​కు 17.2 ఓవర్లలో 210 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్​పాండే 2 వికెట్లు దక్కించుకున్నాడు.

ఐపీఎల్​లో 100వ సెంచరీ :ఈ మ్యాచ్​లో గిల్ శతకంతో ఐపీఎల్​లో 100వ సెంచరీ నమోదైంది. వెంటనే సాయి సుదర్శన్​ కూడా 100 పరుగుల మార్క్ అందుకున్నాడు. దీంతో ఇప్పటివరకు ఐపీఎల్​లో 101 సెంచరీలు నమోదయ్యాయి. కాగా, ఐపీఎల్​లో గిల్​కు ఇది 4వ శతకం. ఈ లిస్ట్​లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 8 సెంచరీలతో అందరి కంటే ముందున్నాడు.

గుజరాత్ అదరహో- గిల్, సుదర్శన్ సెంచరీలు- ఆ రికార్డు సమం! - IPL 2024

పంజాబ్​కు ప్లే ఆఫ్ ఆశలు గల్లంతు​ - ఆర్సీబీ నాలుగో విక్టరీ - IPL 2024

Last Updated : May 11, 2024, 6:28 AM IST

ABOUT THE AUTHOR

...view details