Gavaskar Warn Nitish Reddy :ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు (బాక్సింగ్ డే టెస్ట్)లో తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి శతకంతో అదరగొట్టాడు. మొత్తం 10 ఫోర్లు, ఒక సిక్స్‌తో 105 రన్స్ కొట్టాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతను కీలక ఇన్నింగ్స్ ఆడి టెస్టుల్లో తన తొలి శతకాన్ని సాధించాడు. అంతేకాదు టీమ్ ఇండియాను ఫాలో-ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు. ఈ నేపథ్యంలోనే నితీశ్ రెడ్డిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు.
'నితీశ్ ఇకముందు నువ్వు అలా చేయొద్దు' - శతక వీరుడికి సునీల్ గావస్కర్ కీలక అడ్వైజ్! - GAVASKAR WARN NITISH REDDY
ఇండియా - ఆస్ట్రేలియా నాలుగో టెస్టులో నితీశ్ రెడ్డి సెంచరీ - సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం!
Published : Dec 28, 2024, 7:27 PM IST
"నితీశ్ రెడ్డికి ఇది టెస్టుల్లో తొలి సెంచరీ. అతను సమీప భవిష్యత్తులో మరిన్ని సెంచరీలు చేయనున్నాడు. భవిష్యత్‌లోనూ అతను వేలాది పరుగులు సాధించాలని కోరుకుంటున్నా. మెల్‌బోర్న్‌లో అతను చేసిన ఈ సెంచరీ భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ సెంచరీలలో ఒకటిగా నిలిచింది. పరిస్థితులకు అనుగుణంగా ఆడగలనని నితీశ్ చూపిస్తున్నాడు. షాట్ సెలక్షన్ కూడా చాలా బాగుంది" అని గావస్కర్ ప్రశంసించారు.
జర జాగ్రత్త!
నితీశ్ రెడ్డిపై ప్రశంసలు కురిపించిన గవాస్కర్ - అదే సమయంలో నితీశ్‌కు కీలక సూచనలు చేశాడు. తను ఈ స్థాయికి చేరుకోవడానికి, అతని తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు చేసిన త్యాగాలను గుర్తుంచుకోవాలని సూచించారు. "నితీశ్ - నీ తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు చేసిన త్యాగాలను నీవు గుర్తుంచుకోవాలి. భారత క్రికెట్ కారణంగా నితీశ్ నీకు ఈ గుర్తింపు దక్కింది. ఇక నుంచి కూడా నీవు జాగ్రత్తగా ఉండాలి. క్రికెట్‌ను ఏమాత్రం తేలిగ్గా తీసుకోకూడదు. ఇకముందు కూడా ఇదే ఆటతీరును కొనసాగిస్తే అద్భుతమైన కెరీర్ నీ సొంతమవుతుంది" అని గవాస్కర్ సూచించారు.