తెలంగాణ

telangana

ETV Bharat / sports

'భారత్​ పిచ్​లపై ఇంగ్లాండ్​ పప్పులుడకవ్- టీమ్ఇండియాకు 'విరాట్​బాల్' ఉంది' - england buzball vs Virat ball

Gavaskar Commensts England Bazball Strategy: జనవరి 25నుంచి భారత్​ స్వదేశంలో ఇంగ్లాండ్​తో ఐదు మ్యాచ్​ల టెస్టు సిరీస్ ఆడనుంది. కొంతకాలంగా టెస్టుల్లో బజ్​బాల్ వ్యూహంతో ఫలితాలు సాధిస్తున్న ఇంగ్లాండ్,​ ఈ సిరీస్​లో స్పిన్ పిచ్​లపై సక్సెస్ సాధిస్తుందా అని ఆసక్తిగా ఉందన్నాడు గావస్కర్.

Gavaskar Commensts England Bazball Strategy
Gavaskar Commensts England Bazball Strategy

By ETV Bharat Telugu Team

Published : Jan 22, 2024, 9:25 AM IST

Updated : Jan 22, 2024, 5:33 PM IST

Gavaskar Commensts England Bazball Strategy:ఇంగ్లాండ్ కొంతకాలంగా టెస్టు క్రికెట్​లో బజ్​బాల్ (దూకుడుగా ఆడే విధానం) వ్యూహంతో బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో అత్యుత్తమ ఫలితాలు సాధించడమే కాకుండా అప్పుడప్పుడు ఘోర పరాజయాలూ మూటగట్టుకుంది. ఈ విషయంపై అప్పట్లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్​ స్టోక్స్ స్పందించాడు. ఫలితాలు ఎలా ఉన్న టెస్టుల్లో బజ్​బాల్ వ్యూహాన్ని ఇంగ్లాండ్ వదులుకోదని స్పష్టం చేశాడు.

ఇక ప్రస్తుతం భారత్​ పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్​ల టెస్టు సిరీస్ ఆడనుంది. జనవరి 25 నుంచి మార్చి 11 వరకు ఈ సిరీస్ జరగనుంది. మరో మూడు రోజుల్లో ప్రారంభమయ్యే తొలి టెస్టుకు ముందు స్టార్ స్పోర్ట్స్​తో మాట్లాడిన టీమ్ఇండియా మాజీ ప్లేయర్ సునీల్ గావస్కర్, ఇంగ్లాండ్​ బజ్​బాల్ విధానంపై కామెంట్స్ చేశాడు.

ఇంగ్లాండ్​కు బజ్​బాల్ వ్యూహం ఉంటే, టీమ్ఇండియాకు 'విరాట్ బాల్' ఉందని గావస్కర్ అన్నాడు.'మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచగల సత్తా విరాట్​ కోహ్లీకి ఉంది. ప్రస్తుతం విరాట్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. టెస్టుల్లో సెంచరీలు దాదాపు హాఫ్ సెంచరీలతో సమానం. గత రెండేళ్లుగా టెస్టు క్రికెట్లో ఇంగ్లాండ్ బజ్‌బాల్‌ విధానంతో దూకుడుగా ఆడుతోంది. పరిస్థితులను లెక్క చేయకుండా ఎలాంటి పిచ్​లపై అయినా ఇంగ్లాండ్ బ్యాటర్లు ధాటిగా ఆడుతున్నారు. మరి ఈ బజ్​బాల్ ప్లాన్ భారత్ స్పిన్నర్లపై సాధ్యమేనా అని ఆసక్తిగా ఉంది. ఇంగ్లాండ్​కు బజ్​బాల్ ఉంటే, భారత్​కు విరాట్ బాల్ ఉంది' అని గావస్కర్ అన్నాడు.

Virat Kohli Test Stats: విరాట్ కోహ్లీ టెస్టుల్లో ఓ అరుదైన రికార్డు అందుకునేందుకు దగ్గర్లో ఉన్నాడు. మరో 152 పరుగులు చేస్తే టెస్టుల్లో 9 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఈ క్రమంలో టెస్టు ఫార్మాట్​లో 9000 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన భారత బ్యాటర్లలో సచిన్ తెందూల్కర్ (15,921), రాహుల్‌ ద్రవిడ్‌ (13,265), సునీల్‌ గావస్కర్‌ (10,122) విరాట్​ కంటే ముందున్నారు. అయితే ఇంగ్లాండ్​తో జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్​ల సిరీస్​లో విరాట్ మరో 152 పరుగులు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. టెస్టుల్లో ఇప్పటివరకు 113 మ్యాచ్​లు ఆడిన విరాట్ 8848 పరుగులు చేశాడు. అందులో 29 సెంచరీలు ఉన్నాయి.

Last Updated : Jan 22, 2024, 5:33 PM IST

ABOUT THE AUTHOR

...view details