Suresh Raina MS Dhoni:టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై సీనియర్ ప్లేయర్ సురేశ్ రైనా రీసెంట్గా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్‌ను రన్ మిషీన్గా పేర్కొన్న రైనా, ధోనీని గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) అని అభివర్ణించాడు. రైనా ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్లో ఆడుతున్నాడు. ఈ టోర్నీలో భాగంగా సౌతాఫ్రికా లెజెండ్స్‌తో మ్యాచ్ అనంతరం రైనా ఈ కామెంట్స్ చేశాడు.
టోర్నీలో ఇటీవల భారత్ లెజెండ్స్ జట్టు సౌతాఫ్రికా లెజెండ్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్ అనంతరం రైనా ప్రజెంటేటర్తో ర్యాపిడ్ ఫైర్‌లో పాల్గొన్నాడు. ఈ ర్యాపిడ్ ఫైర్ సెషన్లో క్రికెట్లో విరాట్‌ను 'కింగ్','రన్ మిషీన్', ధోనీని 'గోట్' (GOAT)గా పేర్కొన్నాడు. దీంతో ధోనీ ఫ్యాన్స్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ధోనీ- రైనా ఫ్రెండ్షిప్ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఇదే ర్యాపిడ్ ఫైర్‌లో మరికొంత మంది ఇండియన్ ప్లేయర్లపై తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడు. పేసర్ జస్ర్పీత్ బుమ్రాను 'డెత్ ఓవర్ స్పెషలిస్ట్', యువరాజ్ సింగ్‌ను 'మోస్ట్ స్టైలిష్', శుభ్‌మన్ గిల్ 'టీమ్ఇండియా ఫ్యూచర్' అని అభివర్ణించాడు.
రైనాకు ధోనీతో ప్రత్యేక అనుబంధం ఉంది. టీమ్ఇండియాతోపాటు ఒక దశాబ్ద కాలం ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కలిసి ఆడారు. చెన్నై జట్టుకు ధోనీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో రైనా వైస్‌కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇక 2020 ఆగస్టు 15న ఒకేరోజు ధోనీ, రైనా ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఆ తర్వాత రైనా 2021లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడగా, ధోనీ ఇంకా కొనసాగుతున్నాడు.