తెలంగాణ

telangana

ETV Bharat / sports

తొలి సెంచరీతోనే అరుదైన క్లబ్​లో సర్ఫరాజ్- దిగ్గజాల సరసన చోటు - SARFARAZ KHAN CENTURY

టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ కెరీర్​లో తొలి సెంచరీతోనే అరుదైన క్లబ్​లో చేరాడు.

Sarfaraz Khan Century
Sarfaraz Khan Century (Source: Associated Press)

By ETV Bharat Sports Team

Published : Oct 19, 2024, 3:23 PM IST

Sarfaraz Khan Century :న్యూజిలాండ్​తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా యంగ్ బ్యాటర్​ సర్ఫరాజ్ ఖాన్ భారీ సెంచరీతో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్​లో పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరిన సర్ఫరాజ్, సెకండ్ ఇన్నింగ్స్​లో ఏకంగా 150 పరుగులతో సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో కెరీర్​లో ఓ అరుదైన క్లబ్​లో దిగ్గజ ఆటగాళ్ల సరసన చోటు దక్కించుకున్నాడు.

ఒకే టెస్టు మ్యాచ్​లో తొలి ఇన్నింగ్స్​లో డకౌట్ అయ్యి, రెండో ఇన్నింగ్స్​లో సెంచరీ బాదిన భారత ఆటగాళ్ల లిస్ట్​లో సర్ఫరాజ్‌ తొమ్మిదో బ్యాటర్​గా నిలిచాడు. ఈ మ్యాచ్​లో సర్ఫరాజ్ (0, 150) పరుగులు నమోదు చేశాడు. మరి ఈ జాబితాలో ఉన్న టీమ్ఇండియా ప్లేయర్లు ఎవరంటే?

ప్లేయర్ తొలి ఇన్నింగ్స్​ రెండో ఇన్నింగ్స్​ ప్రత్యర్థి
మాధవ్‌ ఆప్టే 0 163 వెస్టిండీస్
సునీల్‌ గావస్కర్‌ 0 118 ఆస్ట్రేలియా
దిలీప్‌ వెంగసర్కార్‌ 0 103 ఇంగ్లాండ్
మహ్మద్‌ అజారుద్దీన్‌ 0 109 పాకిస్థాన్‌
సచిన్‌ తెందూల్కర్‌ 0 136 పాకిస్థాన్‌
శిఖర్‌ ధావన్‌ 0 114 న్యూజిలాండ్
విరాట్ కోహ్లీ 0 104 శ్రీలంక
శుభ్‌మన్‌ గిల్‌ 0 119 బంగ్లాదేశ్‌

కాగా, ఇదే ఏడాది ఇంగ్లాండ్​పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఆకట్టుకుంటున్నాడు. అరంగేట్ర మ్యాచ్ తొలి ఇన్నింగ్స్​లోనే హాఫ్ సెంచరీ బాదాడు. ఇక ఇప్పటివరకు 4 మ్యాచ్​ల్లో 7 ఇన్నింగ్స్​ ఆడిన సర్ఫరాజ్ 58.33 సగటుతో 350 పరుగులు చేశాడు. అందులో 1 సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 150 పరుగులు అతడి అత్యధిక స్కోర్. మరోవైపు టీమ్ఇండియా సెకండ్ ఇన్నింగ్స్​లో రాణిస్తోంది. ఇక తొలి ఇన్నింగ్స్​లో భారత్ 46 పరుగులకే ఆలౌట్ కాగా, న్యూజిలాండ్ 402 భారీ పరుగులు సాధించింది.

'వద్దు బాబోయ్‌ వద్దు' - పంత్​ను ఆపేందుకు సర్ఫరాజ్​ ఫన్నీ స్టంట్ - నవ్వులే నవ్వులు

సింపుల్ లైఫ్, కానీ ఖరీదైన లగ్జరీ కార్లు - సర్ఫరాజ్ నెట్ వర్త్ ఎన్ని కోట్లంటే?

ABOUT THE AUTHOR

...view details