Phil Salt vs West Indies T20: 2024 టీ20 వరల్డ్‌కప్ సూపర్ 8ను ఇంగ్లాండ్ గ్రాండ్‌గా ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (87 పరుగులు; 47బంతుల్లో: 7x4, 5x6) అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ విజయం కట్టబెట్టాడు. అయితే టీ20 ఫార్మాట్లో విండీస్‌పై సాల్ట్‌కు ఘనమైన రికార్డు ఉంది.
ఒకే ఓవర్లో 30 పరుగులు:ఛేదనలో సాల్ట్ ఓ దశలో 37 బంతుల్లో 49 పరుగులతో ఉన్నాడు. అప్పటికి ఇంగ్లాండ్ విజయానికి 30 బంతుల్లో 40 పరుగులు కావాలి. ఇక రొమారియో రెపర్డ్స్ వేసిన 16వ ఓవర్లో సాల్ట్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ ఓవర్లో వరుసగా 4,6,4,6,6,4 బాది ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. దీంతో టీమ్ఇండియా విక్టరీ దాదాపు ఖరారైంది. అయితే చివరి 10 బంతుల్లో 38 పరుగులు బాదాడు. ప్రత్యర్థి విండీస్ అంటేనే చాలు సాల్ట్ ఇలాగే చెలరేగిపోతున్నాడు. విండీస్‌పై సాల్ట్ గణాంకాలపై ఓ లుక్కేద్దాం.
- అంతర్జాతీయ టీ20ల్లో సాల్ట్ ఇప్పటివరకు 26 ఇన్నింగ్స్‌ల్లో 844 పరుగులు చేయగా అందులో 50 శాతానికి పైగా విండీస్‌పై బాదినవే కావడం విశేషం.
- వెస్టిండీస్‌పై సాల్ట్ ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో సాల్ట్ 68.28 సగటు, 186.71 స్ట్రైక్ రేట్‌తో 487 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌ల్లో సాల్ట్ సగటున ప్రతి నాలుగు బంతులకొక ఫోర్ లేదా సిక్స్ బాదడం విశేషం.
- ఇంటర్నేషనల్ టీ20ల్లో సాల్ట్ బాదిన 2 సెంచరీలు కూడా విండీస్‌పైనే కావడం గమనార్హం. అత్యధికం 119 పరుగులు. ఇక ఖాతాలో మూడు హాఫ్ సెంచరీలు ఉండగా, అందులో రెండు వెస్టిండీస్‌పై సాధించినవే.
- విండీస్‌పై అత్యధిక సిక్స్‌లు బాదిన ఇంగ్లాండ్ బ్యాటర్ కూడా సాల్టే. అతడు మొత్తంపై 32 సిక్స్‌లు నమోదు చేశాడు.
- ఇంగ్లాండ్- విండీస్ ఫైట్‌లో అత్యధిక పరుగులు బాదిన బ్యాటర్ సాల్ట్. అతడు ఇప్పటివరకు 487 పరుగులు బాదాడు. సాల్ట్ తర్వాత అలెక్స్ హేల్స్ (423 పరుగులు), క్రిస్ గేల్ (422 పరుగులు), నికోలస్ పూరన్ (420), జాస్ బస్టర్ (390) వరుసగా ఉన్నారు.