Joe Root WTC 5000 Runs :ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ కెరీర్లో మరో ఘనత సాధించాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 5 వేలు పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో ప్రపంచంలోనే ఈ మైలురాయి అందుకున్న తొలి బ్యాటర్‌గా రూట్ రికార్డు సృష్టించాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రూట్ 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఘతన అందుకున్నాడు. డబ్ల్యూటీసీలో ఇప్పటివరకు 59 మ్యాచ్‌లు ఆడిన రూట్ 51.59 సగటుతో 5005 పరుగులు చేశాడు. అందులో 16 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
కాగా, రూట్ తర్వాత డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబూషేన్ (3904 పరుగులు) ఉన్నాడు. అంటే తొలి ప్లేస్‌లో ఉన్న రూట్, రెండో స్థానంలో ఉన్న లబూషేన్‌కు 1000+ పరుగుల తేడా ఉంది.
సీజన్ల వారిగా రూట్ పరుగులు
2019-21 - 1660 పరుగులు- 3 సెంచరీలు
2021-23 - 1915 పరుగులు- 8 సెంచరీలు
2023-25- 1400* పరుగులు- 5 సెంచరీలు
డబ్ల్యూటీసీలో టాప్ రన్ స్కోరర్స్
జో రూట్
ఇంగ్లాండ్
59 మ్యాచ్‌లు
5005 పరుగులు
మార్నస్ లబూషేన్
ఆస్ట్రేలియా
45
3904
స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా
45
3486
బెన్ స్టోక్స్
ఇంగ్లాండ్
48
3101
బాబర్ ఆజమ్
పాకిస్థాన్
32
2755
సచిన్ రికార్డుకు చేరువలో 2024లో రూట్ అత్యుత్తమ ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది (క్యాలెండర్ ఇయర్)లో రూట్ ఇప్పటికే 1000 టెస్టు పరుగులు పూర్తి చేశాడు. టెస్టుల్లో ఏడాదిలో 1000+ పరుగులు చేయడం రూట్ కెరీర్లో ఇది ఐదోసారి. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజాలు బ్రియన్ లారా, మ్యాథ్యూ హెడెన్, జాక్వెస్ కల్లిస్, రికీ పాంటింగ్, కుమార సంగక్కర, అలిస్టర్ కూస్ సరసన చేరి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వీళ్లంతా కూడా తమతమ టెస్టు కెరీర్లో ఐదుసార్లు 1000+ పరుగులు చేశారు. కాగా, ఈ లిస్ట్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ టాప్‌లో ఉన్నాడు. సచిన్ తన కెరీర్లో ఆరుసార్లు ఈ ఘనత సాధించాడు. రూట్ ఇదే ఫామ్ కొనసాగిస్తే, సచిన్ రికార్డును వచ్చే ఏడాదే సమం చేసే ఛాన్స్ ఉంది.
కాగా, ఓవరాల్‌గా రూట్ తన టెస్టు కెరీర్లో 147 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 50+ యావరేజ్‌తో ఇప్పటివరకు 12400 పరుగులు చేశాడు. అందులో 34 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Eng vs Pak 1st Test 2024: ఇక మ్యాచ్ విషయానికొస్తే, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 96-1 స్కోర్‌తో ఉంది. క్రీజులో రూట్ (32), జాక్ క్రాలీ (64) ఉన్నారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 556-10భారీ స్కోర్ నమోదు చేసింది.