Dawid Malan Retirement:ఇంగ్లాండ్ డాషింగ్ బ్యాటర్ డేవిడ్ మలన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు బుధవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడు చివరగా 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఆడాడు. మలన్ కెరీర్లో 22టెస్టు, 30 వన్డే, 62 టీ20 మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ సాధించిన అతి తక్కువ ఇంగ్లాండ్ బ్యాటర్లలో మలన్ ఒకడు. అయితే 2017లో ఇంటర్నేషనల్ అరంగేట్రం చేసిన మలన్ కేవలం 7 ఏళ్లలోనే కెరీర్‌కు వీడ్కోలు పకలడం గమనార్హం.
టీ20ల్లో భేష్
అంతర్జాతీయ క్రికెట్లోకి డేవిడ్ మలన్ పొట్టి ఫార్మాట్‌తోనే ఎంట్రీ ఇచ్చాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికాపై భారీ ఇన్నింగ్స్‌తో (78 పరుగులు 44 బంతుల్లో) సత్తా చాటాడు. ఆ తర్వాత కూడా అదే దూకుడుతో కేవలం 24 ఇన్నింగ్స్‌ల్లోనే 1000 పరుగులు పూర్తి చేశాడు. ఈ క్రమంలో పరుషుల టీ20 క్రికెట్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయి అందుకున్న ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఇక 2020 నవంబర్‌లో టీ20 ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానానికి చేరుకున్నాడు. అలాగే 2022 టీ20 వరల్డ్‌కప్ నెగ్గిన ఇంగ్లాండ్ జట్టులో మలన్ సభ్యుడిగా ఉన్నాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు పొట్టి ఫార్మాట్లో 62మ్యాచ్‌ల్లో మలన్ 132.49 స్ట్రైక్ రేట్‌తో 1892 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.