India Vs England 3rd T20 :హ్యాట్రిక్ విజయంతో దూసుకెళ్లాలనుకున్న టీమ్ఇండియాకు బ్రేక్ పడింది. అయిదు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన మూడో మ్యాచ్‌లో 26 పరుగుల తేడాతో ఇంగ్లిష్ జట్టు చేతిలో ఓటమిని చవి చూసింది. దీంతో భారత్ ఆధిక్యం 2-1కు పడిపోయింది. హార్దిక్ పాండ్య (40) మినహా ఇంకెవరూ టాప్‌స్కోర్ చేయలేదు.
మ్యాచ్ ఎలా సాగిదంటే?
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ టీమ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు సాధించింది. ఓపెనర్ బెన్ డకెట్ (51), మిడిలార్డర్ బ్యాటర్ లివింగ్స్టన్ (43) మెరుపులు మెరిపించారు. ఇక టీమ్ఇండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి (5/24) ఐదు వికెట్లతో అదరగొట్టాడు. హార్దిక్ పాండ్య (2/33), అక్షర్ పటేల్ (1/19) కూడా తమదైన శైలిలో ఆకట్టుకున్నారు.
అయితే 172 లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా అవసరం లేని షాట్లు ఆడి నిరాశపరిచింది. దీంతో క్రమంగా భారత్‌కు ఓటమి తప్పలేదు. గత మ్యాచ్‌లో మేటి ఇన్నింగ్స్‌తో మెరిసన తిలక్ (18)ను అద్భుతమైన బంతితో రషీద్ బౌల్డ్ చేయడం వల్ల మ్యాచ్‌లో కీలక మలుపుగా నిలిచింది. అంతకంటే ముందు అభిషేక్ శర్మ (24), సంజు శాంసన్ (3), సూర్యకుమార్ యాదవ్ (14) కూడా అంతంతమాత్రంగానే ఆడారు. దీంతో 48/3తో కష్టాల్లో పడ్డ జట్టును, హార్దిక్, తిలక్ ఆదుకోవాలని చూసినప్పటికీ అది