Dhoni Craze In CSK Fans :చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీమ్ఇండియాలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించి భారత్‌కు ఎన్నో కప్‌లను సాధించిన ఈ స్టార్ క్రికెటర్ ఐపీఎల్‌లోనూ పలు రికార్డులను నమోదు చేసి సత్తా చాటుతున్నారు. అన్ని ఫర్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, 42 ఏళ్ల వయసులోనూ చురుగ్గా ఆడుతున్నాడు.
అయితే ఐపీఎల్‌లో చెన్నై జట్టుకు ఎందుకు అంత క్రేజ్ ఉంది అన్న ప్రశ్నకు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తాజాగా సమాధానమిచ్చాడు. ఆ జట్టులో ధోనీ ఉండటం వల్లనే ఆ టీమ్‌కు అంతటి క్రేజ్ అని కొనియాడాడు. తాను సిక్స్ లేదా ఫోర్ కొట్టినా అంతగా స్పందించని అభిమానులు, ధోనీ డగౌట్లో కనిపించినా కూడా పండుగ చేసుకుంటారని వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయంపై చెన్నై ప్లేయర్ రవీంద్ర జడేజా కూడా నిరుత్సాహానికి గురైన సందర్భాలు ఉన్నప్పటికీ వాటి గురించి అతడు ఎప్పుడూ పట్టించుకోలేదని తెలిపారు.
"గత కొంతకాలంగా నేను, జడేజా ఇలాంటి అనుభవాలను చాలానే ఎదుర్కొన్నాం. బౌండరీ కొట్టినా, వికెట్ తీసినా కూడా పెద్దగా స్పందన ఉండదు. కానీ ధోనీ కనిపిస్తే చాలు అభిమానుల సందడికి ఇక హద్దే ఉండదు. చెన్నై జట్టు ఫ్యాన్స్ అంతా మొదట ధోనీకే అభిమానులు. ఆ తర్వాతనే ఫ్రాంచైజీకి అని నేను గట్టిగా చెప్పగలను. జడ్డూకి ఇలాంటివి చాలాసార్లు జరిగాయి. అయితే అతడేమీ దాని గురించి ఎప్పుడూ అంతగా ప్రస్తావించలేదు. 'గాడ్ ఆఫ్ చెన్నై' ధోనీ. తప్పకుండా భవిష్యత్తులో అతడి కోసం గుడి కడతారు. భారత్‌కు రెండు వరల్డ్ కప్‌లు తెచ్చాడు. ఐపీఎల్‌లో చెన్నై జట్టు ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపాడు. ప్లేయర్లపై అత్యంత నమ్మకం ఉంచే 'కెప్టెన్ కూల్' అతడే. నేషనల్ టీమ్‌తో పాటు చెన్నై జట్టుకు విశిష్ట సేవలు అందించాడు. దిగ్గజ ప్లేయర్‌ను మైదానంలో చూశాక ఆడియన్స్ సంబరాలు చేసుకోకుండా ఉండలేరు" అంటూ రాయుడు వివరించారు.
ఒంటిచేత్తో సిక్సర్స్ కొట్టిన స్టార్ క్రికెటర్ - వింటేజ్ ధోనీ ఈజ్ బ్యాక్ - IPL 2024
ధోనీ నెం.9లో ఎందుకు వచ్చాడంటే? - అసలు రీజన్ ఇదే - IPL 2024 CSK