Devdutt Padikkal England Series :రాంచీ వేదికగా మరికొద్ది సేపట్లో భారత్, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరు జట్లు పోరుకు సంసిద్ధమయ్యాయి. ఇక ఇంగ్లాండ్ కూడా తమ తుది జట్టును కూడా ప్రకటించింది. అయితే టీమ్ఇండియా ప్లేయర్లలో మాత్రం ఇప్పటికీ సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే తుదిజట్లపై పలు అంచనాల గురించి క్రికెట్ విశ్లేషకులు చర్చిస్తుండగా, తాజాగా మరో ఇద్దరి ప్లేయర్ల గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి.
గాయం నుంచి కేఎల్ రాహుల్ కోలుకున్నప్పటికీ అతడు ఇంకా ఫిట్‌నెస్ సాధించలేకపోవడం వల్ల రానున్న నాలుగో టెస్ట్‌కు అర్హత కోల్పోయాడు. దీంతో మిడిలార్డర్లో రాహుల్‌కు ప్రత్యామ్నాయంగా రెండు, మూడు టెస్ట్‌లకు యంగ్ ప్లేయర్ రజత్ పటీదార్‌ను ఎంపిక చేశారు. అయితే అతుడు గత మ్యాచుల్లో ఆశించిన స్థాయిలో రాణించకలేకపోయాడు. దీంతో ఈ ఒక్క పొజిషన్ విషయంలో మేనేజ్‌మెంట్ ఎటువంటి నిర్ణాయాలను తీసుకోలేకపోతోంది. అయితే పటీదార్ ప్లేస్‌లో మరోకరికి అవకాశం ఇవ్వాలా లేకుంటే దేవ్‌దత్ పడిక్కల్‌కు ఛాన్స్ ఇవ్వాలా అంటూ మేనేజ్‌మెంట్ ఆలోచనలో పడిపోయింది.
అయితే తాజాగా ఈ విషయంపై టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ స్పందించారు. పటీదార్ మంచి ప్లేయర్ అంటూ తెలిపిన ఆయన, ఒకటి రెండు వైఫల్యాలకే ఏ ఆటగాడి నైపుణ్యాన్ని శంకించకూడదంటూ పేర్కొన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లోనూ పటీదార్ ఎంట్రీ ఖాయమని అనుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే గత ఆరు ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో దేవదత్ పడిక్కల్ నాలుగు శతకాలు మోగించాడు. దీంతో పాటిదార్‌తో పోలిస్తే పడిక్కల్ చాలా బెటర్ అంటూ క్రికెట్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు.
ఇక మూడో టెస్టులో ద్విశతకంతో అదరగొట్టిన యశస్వీ జైశ్వాల్ ఈ మ్యాచ్‌లోనూ కెప్టెన్ రోహిత్‌తో ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. వన్ డౌన్‌లో గిల్, తర్వాత రజత్ పటిదార్ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశముంది. సీనియర్ ఆల్‌రౌండర్ జడేజా, అరంగేంట్ర టెస్టులోనే అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్ మళ్లీ రాణించాలని జట్టు భావిస్తోంది. వర్క్‌లోడ్‌తో పాటు భవిష్యత్ మ్యాచ్‌లను దృష్టిలో ఉంచుకుని స్టార్ బౌలర్ బుమ్రాకు విశ్రాంతినివ్వడం వల్ల ఈ మ్యాచ్‌లో అతడి స్థానంలో ఎవరు ఆడతారనేది ఆసక్తిగా మారింది.
భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రజత్ పాటిదార్/దేవ్‌దత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్, దృవ్ జురెల్, అశ్విన్, కుల్దీప్, సిరాజ్, ఆకాశ్‌దీప్