తెలంగాణ

telangana

ETV Bharat / sports

60ఏళ్ల తర్వాత తొలిసారి - పాకిస్థాన్​పై భారత్ విజయం - పాకిస్థాన్​పై భారత్ గెలుపు

Davis Cup 2024 IND VS PAK : 60 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్‌లో ఆడిన భారత టెన్నిస్‌ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ప్రత్యర్థిని 4-0తో చిత్తు చేసింది. తద్వారా డేవిస్‌కప్‌ ప్రపంచ గ్రూప్‌-1లోకి అడుగుపెట్టింది.

60ఏళ్ల తర్వాత తొలిసారి - పాకిస్థాన్​పై భారత్ విజయం
60ఏళ్ల తర్వాత తొలిసారి - పాకిస్థాన్​పై భారత్ విజయం

By ETV Bharat Telugu Team

Published : Feb 5, 2024, 7:42 AM IST

Updated : Feb 5, 2024, 10:05 AM IST

Davis Cup 2024 IND VS PAK : 60 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్‌ గడ్డపై ఆడిన భారత టెన్నిస్‌ జట్టు అదిరిపోయే ప్రదర్శన చేసింది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ప్రత్యర్థి జట్టును 4-0తో చిత్తు చేసింది. తద్వారా డేవిస్‌కప్‌ ప్రపంచ గ్రూప్‌-1లో చోటు సంపాదించింది. ప్లేఆఫ్స్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచిన భారత్‌ రెండోరోజు జరిగిన మ్యాచుల్లోనూ గెలిచింది. డబుల్స్‌, రివర్స్‌ సింగిల్స్​లో నెగ్గి ఘన విజయాన్ని దక్కించుకుంది.

పురుషల డబుల్స్‌లో సాకేత్‌ మైనేని-యుకి బాంబ్రి ద్వయం 6-2, 7-6 (7-5)తో ముజామిల్‌ మొర్తజా-అకీల్‌ఖాన్‌ జంటను ఓడించడంతో భారత్‌కు 3-0 తేడాతో విజయం ఖరారైంది. నామమాత్రపు నాలుగో మ్యాచ్​లో నికీ పూంచా 6–3, 6–4తో షోయబ్‌ మహ్మద్​పై గెలవడం వల్ల భారత్‌ ఆధిక్యం 4 0కు చేరింది. ఇక అప్పటికే ఫలితం తేలిపోవడం వల్ల ఐదో మ్యాచ్‌ను నిర్వహించలేదు. దీంతో ఆరు దశాబ్దాల తర్వాత పాకిస్థాన్​ పర్యటనకు వెళ్లిన భారత్​కు ఇదే తొలి విజయం కావడం విశేషం. మొత్తంగా ఈ టోర్నీ చరిత్రలో పాక్‌పై భారత్‌కు ఇది ఎనిమిదో విజయం.

మ్యాచ్ సాగిందిలా : తొలి సెట్లో భారత జంట దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థిపై ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తొలి, ఐదో గేమ్‌లలో సర్వీస్‌లు బ్రేక్‌ చేసి 4-1తో ఆధిక్యంలో నిలవడంతో పాటు సెట్‌ గెలిచింది. అయితే రెండో సెట్​లో మాత్రం పాక్‌ జోడీ నుంచి భారత ద్వయానికి గట్టి పోటీ ఎదురైంది. యుకీ జోడీ కూడా పట్టుదలతో ప్రదర్శన చేయడంతో సెట్‌ టై బ్రేకర్‌కు మళ్లింది. దీంతో టై బ్రేకర్‌లో సర్వీసుల్లో ఇబ్బంది పడిన భారత ద్వయం 2-4తో వెనుకబడింది. అయితే తర్వాత పుంజుకుని స్కోరును సమం చేసింది. అలా పట్టుదలతో గేమ్ ఆడుతూ సెట్‌తో పాటు మ్యాచ్‌ను దక్కించుకుంది. అకీల్‌ డబుల్‌ ఫాల్ట్‌ చేయడం వల్ల భారత్‌ విజయాన్ని అందుకుంది. ఇక నామమాత్రమైన రివర్స్‌ సింగిల్స్‌ మ్యాచ్‌లో అరంగేట్ర ప్లేయర్​ నికీ పూంచా 6-3, 6-4తో మహ్మద్‌ షోయబ్‌పై విజయం సాధించాడు. రెండో రివర్స్‌ సింగిల్స్‌ ఆడలేదు.

రచిన్ రవీంద్ర - డబుల్​ సెంచరీతో విధ్వంసం

'అది నాకూ తెలీదు- అయ్యర్ వల్లే ఇదంతా': గిల్

Last Updated : Feb 5, 2024, 10:05 AM IST

ABOUT THE AUTHOR

...view details