తెలంగాణ

telangana

ETV Bharat / sports

డేవిడ్ భాయ్ వరల్డ్ రికార్డ్- ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్​ - David Warner T20 stats

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కెరీర్​లో అరుదైన ఘనత సాధించాడు. శుక్రవారం వెస్టిండీస్​తో జరిగిన మ్యాచ్​లో వార్నర్ ఈ రికార్డు సృష్టించాడు.

David Warner 100 Half Century
David Warner 100 Half Century

By ETV Bharat Telugu Team

Published : Feb 10, 2024, 10:16 AM IST

Updated : Feb 10, 2024, 10:39 AM IST

David Warner 100 Half Century:ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన కెరీర్​లో అరుదైన ఘనత అందుకున్నాడు. శుక్రవారం వెస్టిండీస్​తో జరిగిన మ్యాచ్​లో హాఫ్ సెంచరీ సాధించి, టీ20ల్లో 100 అర్ధ శతకాలు నమోదు చేసిన తొలి క్రికెటర్​గా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా కెరీర్​లో 100వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్​లో ఈ ఘనత సాధించడం విశేషం. ఇక అన్ని ఫార్మాట్​లలోనూ 100 మ్యాచ్​లు మూడో ఆడిన మూడో క్రికెటర్​గా నిలిచాడు. వార్నర్​ కంటే ముందు న్యూజిలాండ్ బ్యాటర్ రాస్ టేలర్, విరాట్ కోహ్లీ ఈ మార్క్ అందుకున్నారు.

ఓవరాల్​గా 367 టీ20 మ్యాచ్​లు ఆడిన వార్నర్ 100 హాఫ్ సెంచరీలు బాదాడు. కాగా, అంతర్జాతీయ టీ20ల్లో వార్నర్​కు ఇది 25వ అర్ధ శతకం. ఇక టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు చేసిన లిస్ట్​లో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ (91) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ (88) మూడో ప్లేస్​లో ఉన్నాడు. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ లిస్ట్​లో 74 అర్ధ శతకాలతో 8వ స్థానంలో కొనసాగుతున్నాడు.

Aus vs Wi 1st T20 2024:ఈ మ్యాచ్​లో వార్నర్ 36 బంతుల్లోనే 70 పరుగులు చేశాడు. దీంతో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది. ఛేదనలో వెస్టిండీస్ 202 పరగులకే పరిమితమై ఓటమిపాలైంది. ఇక మెరుపు హాఫ్ సెంచరీతో రాణించిన వార్నర్​కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అవార్డు ప్రజెంటేషన్​లో వార్నర్ టీ20 రిటైర్మెంట్​ క్లారిటీ ఇచ్చాడు. 'మ్యాచ్​లో గెలవడం సంతోషంగా ఉంది. బ్యాటింగ్​కు ఈ పిచ్ అనుకూలించింది. నేను 2024 టీ20 వరల్డ్​కప్​లో ఆడాలనుకుంటున్నా. ఆ తర్వాత పొట్టి ఫార్మాట్​ క్రికెట్ నుంచి కూడా తప్పుకుంటా. ఈ 6 నెలలు మేం ఆడాల్సిన సిరీస్​లు చాలానే ఉన్నాయి. న్యూజిలాండ్​తో త్వరలో జరగనున్న సిరీస్​కు కూడా ఇదే జట్టుతో వెళ్తామనుకుంటున్నా' అని వార్నర్ అన్నాడు. ఇక ఈ పర్యటనలో వెస్టిండీస్ ఆసీస్​కు అసలు పోటీనే ఇవ్వలేకపోతోంది. ఇదివరకే ముగిసిన టెస్టు, వన్డే సిరీస్​ల్లో దారుణంగా ఓడింది.

హాలీవుడ్ రేంజ్​లో వార్నర్ ఎంట్రీ- గ్రౌండ్​లోనే హెలికాప్టర్ ల్యాండింగ్

'గ్రేట్​' అనేంతలా వార్నర్​ ఏం చేయలేదు' - ఆసీస్​ ఓపెనర్​పై మాజీ కోచ్​ కామెంట్స్​

Last Updated : Feb 10, 2024, 10:39 AM IST

ABOUT THE AUTHOR

...view details