Australian Open 2025 :2025 ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఓటమి బాధలో ఉన్న రష్యా టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వెదెవ్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే మ్యాచ్‌లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన మెద్వెదెవ్‌కు నిర్వాహకులు 76వేల డాలర్ల ఫైన్ విధించారు. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.44 లక్షలు. మైదానంలో క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరించినందుకుగాను అతడికి జరిమానా విధించినట్లు టోర్నీ నిర్వాహకులు తెలిపారు. మరి అతడు ఏం చేశాడంటే?
టోర్నీ తొలి రౌండ్లో 418 ర్యాంక్ కసిడిట్ సమ్రేజ్పై మెద్వెదెవ్ విజయం సాధించాడు. ఈ ఆనందంలో అతడు తన రాకెట్‌తో పలు మార్లు నెట్ కెమెరాను బాదుతూ దాన్ని ధ్వంసం చేశాడు. దీంతో నిర్వాహకులు అతడిపై క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించారు. తొలి తప్పిదం కింద భావించిన నిర్వాహకులు ఇది మళ్లీ జరగకూడదని హెచ్చరించి అతడికి 10వేల డాలర్లు ఫైన్ విధించారు.