CSK VS SRH IPL 2024 :హైదరాబాద్‌లో హీట్ పెరిగింది. అది సమ్మర్ హీట్ మాత్రమే కాదు ధోనీ ఆడుతున్న మ్యాచ్ క్రేజ్ కూడా. ఐపీఎల్ సీజన్‌లో భాగంగా కొద్ది రోజుల క్రితం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ వర్మ, తిలక్ వర్మలు ముంబయి ఇండియన్స్‌పై అత్యుత్తమ ఫామ్ కనబరిచారు. ఆ మ్యాచ్‌తో సన్‌రైజర్స్ 277 అత్యధిక స్కోరు నమోదు చేసింది.
శుక్రవారం జరిగే మ్యాచ్‌లోనూ హైదరాబాద్ నుంచి అదే తరహా పెర్‌ఫార్మెన్స్ ఆశిస్తున్నా, ప్రత్యర్థి జట్టు పైనే ఫోకస్‌డ్‌గా ఉన్నారు హైదరాబాదీలు. చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతున్న మ్యాచ్ కావడం వల్ల కచ్చితంగా 200కి పైగా స్కోరు చేస్తేనే గెలుస్తామని, అదే తరహా ప్రిపరేషన్ లో ఉన్నామని ఎస్సార్హెచ్ కోచ్ డేనియల్ వెట్టోరి వెల్లడించారు.
ఇదిలా ఉంటే, సిటీ మొత్తం ధోనీ మానియానే నడుస్తుంది. ధోనీ ఆడే చివరి లీగ్ అని ప్రచారం జరగడంతో ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోయింది. ఇదంతా క్యాష్ చేసుకునేందుకు ఫేక్ టికెట్స్ సర్క్యూలేట్ చేస్తున్నారంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టికెట్ కొనుగోలుదారులకు వార్నింగ్ ఇచ్చింది. స్టేడియంలో టిక్కెట్లు ఎక్కువ శాతం వరకూ ఆన్‌లైన్‌లో ఉంచలేదని, వాటిని కాంప్లిమెంటరీ టిక్కెట్ల రూపంలో అమ్మాలని చూస్తున్నట్లు కూడా మేనేజ్మెంట్ ఆరోపణలు వినిపిస్తున్నాయి.