Cricketers Who Played Only One IPL Match : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చాలా మంది క్రికెటర్లకు గుర్తింపు తీసుకొచ్చింది. 2008లో ప్రారంభమైనప్పటి నుంచి చాలా మంది క్రికెటర్లు ఈ ప్రీమియర్ లీగ్ ద్వారా పరిచయమయ్యారు. వారిలో కొందరు ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్నారు. అయితే ఐపీఎల్‌లో చాలా అవకాశాలు వచ్చినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయిన ఆటగాళ్లు కూడా ఉన్నారు.
అయితే ఈ రెండు కేటగిరీలు కాకుండా ఐపీఎల్‌లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన క్రికెటర్లు కూడా ఉన్నారు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగినప్పటికీ, ఐపీఎల్‌లో మళ్లీ కనిపించలేదు. ఆ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
షోయబ్ అక్తర్
క్రికెట్ ప్రపంచంలో షోయబ్ అక్తర్‌ని 'రావల్పిండి ఎక్స్‌ప్రెస్' అని పిలుస్తారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అక్తర్ ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఫాస్ట్ బౌలర్ కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచ్‌లోనే గుర్తుండిపోయే ప్రదర్శన ఇచ్చాడు. దిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్తర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 11 పరుగులు ఇచ్చి, 4 వికెట్లు పడగొట్టాడు. వీరేంద్ర సెహ్వాగ్, ఏబీ డివిలియర్స్ వంటి స్టార్ ఆటగాళ్లను పెవిలియన్ చేర్చాడు. దీని తర్వాత అక్తర్ మరో ఐపీఎల్ మ్యాచ్ ఆడలేకపోయాడు. 2008 ముంబయి పేలుళ్ల తర్వాత పాకిస్థాన్ ప్లేయర్లు ఐపీఎల్‌లో పాల్గొనకుండా బీసీసీఐ నిషేధించింది.