Ind vs Ire T20 World Cup:2024 టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ బుధవారం (జూన్ 5) ఐర్లాండ్‌ను ఢీ కొట్టనుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో బిజీగా ఉన్నారు. అయితే టీమ్ఇండియా తుది జట్టు ఎలా ఉండనుందోనని ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ప్రారంభిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలూ వెలువడ్డాయి. ఈ క్రమంలో మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తుది జట్టు అంచనా వేశాడు. తుదిజట్టులో యంగ్ బ్యాటర్ యశస్వీ జైశ్వాల్‌కు స్థానం దక్కడం కష్టమేనంటూ హాట్ కామెంట్స్ చేశాడు. బుధవారం జియో సినిమాతో మాట్లాడిన ఆకాశ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
'రోహిత్‌తో కలిసి విరాట్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తే, జైశ్వాల్‌కు జట్టులో ప్లేస్ ఉండదు. వన్ డౌన్లో బ్యాటింగ్ చేసేందుకు లెఫ్ట్ హ్యాండర్ రిషభ్‌కు ఛాన్స్ లభించవచ్చు. టీమ్ఇండియాకు లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్లు చాలా అవసరం. దీంతో జట్టులో లెఫ్ట్ హ్యాండర్లు ఉండాలని మేనేజ్మెంట్ భావిస్తే జైశ్వాల్‌కు బదులు శివమ్ దూబేను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. అప్పుడు సూర్యకుమార్ యాదవ్ నెం.4లో బ్యాటింగ్‌కు వస్తాడు. ఇక మ్యాచ్ పరిస్థితిని బట్టి ఆ తర్వాత లెఫ్ట్ హ్యాండర్ కావాలంటే దూబే, రైట్ హ్యాండర్ అవసరం అనుకుంటే హార్దిక్ పాండ్య వరుసగా 5, 6 స్థానాల్లో వస్తారు. ఇక రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ 7, 8 పొజిషన్లో బ్యాటింగ్ చేస్తారు. చివర్లో కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా దిగుతారు' అని ఆకాశ్ ప్లేయింగ్ 11 అంచనా వేశాడు.