Rohit Sharma Childhood coach :ఏ ఆటగాడైనా తాను ఎంచుకున్న రంగంలో రాణించాలంటే కోచ్‌ది కీలత పాత్ర. అందులోనూ చిన్ననాటి కోచ్ మరింత కీలకం. అలా టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ విజయవంతం అవ్వడంలో తన చిన్ననాటి కోచ్ దినేశ్ లడ్ పాత్ర అమోఘం. 2000వ సంవత్సరంలోనే రోహిత్లోని ప్రతిభను గుర్తించిన లడ్, తనను అత్యుత్తమంగా తీర్చిదిద్దాడు.
ఆ తర్వాత 2007లో టీమ్ఇండియా అరంగేట్రం చేసిన హిట్‌మ్యాన్ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. అయితే తన కెరీర్ ప్రారంభ రోజుల్లో ముఖ్య పాత్ర పోషించిన దినేశ్‌కు హిట్‌మ్యాన్ ఓ ప్రామిస్ చేశాడట. చేయడమే కాదు అది నిలబెట్టుకున్నాడు కూడా. ఈ విషయం తన కోచ్ దినేశ్ లడ్ రీసెంట్గా ఓ సందర్భంలో చెప్పాడు.
'2023 వన్డే వరల్డ్ కప్ ఓటమి తర్వాత రోహిత్‌ను కలిశా. ఫైనల్లో మనం బాగా ఆడలేదు. ముఖ్యంగా నువ్వు ఔటైన తీరు, మ్యాచ్‌పై ప్రభావం చూపింది. ఆ టైమ్‌లో నీ వికెడ్ పడకుండా ఉండుంటే పరిస్థితి ఇంకోలా ఉండేదేమో! కానీ, మొత్తం సిరీస్‌లో నువ్వు చాలా పాజిటివ్‌గా, జట్టు కోసం అద్భుతంగా ఆడావు' అని రోహిత్‌తో చెప్పాను.