AUS VS SA Champions Trophy 2025 :పాకిస్థాన్‌లోని రావల్పిండి వేదికగా బుధవారం జరగాల్సిన ఆస్ట్రేలియా - సౌతాఫ్రికా మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో మ్యాచ్‌ను వీక్షించేందుకు వర్షంలో వెయిట్ చేసిన ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగానే టాస్ పడకుండా ఈ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. అయితే ఈ కారణంగా ఇరు జట్లకు చెరో పాయింట్‌ను ఇచ్చారు. ఇక మొదట్లో వర్షం తగ్గుముఖం పట్టేలా కనిపించడం వల్ల 20 ఓవర్ల చొప్పున ఆడించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆఖరికి ఈ మ్యాచ్‌ను పూర్తిగానే రద్దు చేశారు. ఈ నేపథ్యంలో టోర్నీ గ్రూప్ Bలో సెమీస్ సమీకరణాలు మారాయి. ఎలాగంటే?
- మ్యాచ్ రద్దు కారణంగా వచ్చిన పాయింట్స్‌తో సౌతాఫ్రికా, ఆసీస్ చెరో మూడు పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. మెరుగైన నెట్ రన్‌రేట్ కారణంగా సౌతాఫ్రికా తొలి స్థానంలో ఉంది.
- అఫ్గానిస్థాన్ మీద 107 పరుగుల భారీ తేడాతో గెలిచిన సౌతాఫ్రికా నెట్ రన్‌రేట్ ఆసీస్ కన్నా మెరుగ్గా ఉంది. ఒక్కో మ్యాచ్ ఓడిపోయిన ఇంగ్లాండ్, అఫ్గానిస్థాన్ సున్నా పాయింట్లతో చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి.
- సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే సౌతాఫ్రికా జట్టు మార్చి 1న ఇంగ్లాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. అప్పుడు మొత్తం 5 పాయింట్లతో సెమీస్‌కు వెళ్తుంది. ఒక వేళ సౌతాఫ్రికా ఓడిపోతే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిన ప్రమాదంలో పడుతుంది.
- ఆస్ట్రేలియా తన తర్వాత మ్యాచ్‌ను శుక్రవారం అఫ్గానిస్థాన్‌తో ఆడనుంది. ఇందులో సెన్సేషన్స్ జరగకుండా ఆసీస్ గెలిస్తే 5 పాయింట్లతో సెమీస్‌కు దూసుకెళ్తుంది.
- ప్రస్తుతం స్టార్ ప్లేయర్లు దూరమైన ఆసీస్ కూర్పు అంత బలంగా లేదు. అలాగే సంచలనాలకు మారుపేరైన అఫ్గాన్‌లు కూడా ఏదైనా అద్భుతం చేసి ఓడిస్తే కంగారూలు సెమీస్‌కి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.
- అఫ్గానిస్థాన్‌తో బుధవారం జరగనున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలిచి, మార్చి 1న సౌతాఫ్రికాపై కూడా గెలిస్తే 4 పాయింట్లతో సెమీస్‌కు చేరుకుంటుంది. ఈ రెండు మ్యాచుల్లో ఒక్కటి ఓడినా సరే ఇంగ్లాండ్‌కు భారీ నష్టమే.
- ఇక అఫ్గానిస్థాన్ విషయానికి వస్తే , వరుసగా రెండు సంచలనాలు నమోదు చేస్తేనే సెమీస్‌కు చేరుకుంటుంది. అంటే ఇంగ్లాండ్, ఆసీస్ లాంటి టాప్ టీమ్స్‌ను ఢీకొట్టి నిలబడాలి. అయితే ఇది అంత ఈజీ కాదు.
- గ్రూప్ A నుంచి ఇప్పటికే టీమ్ఇండియా, న్యూజిలాండ్ సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. మార్చి 2న ఇరు జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌లో గెలిచిన వారు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలుస్తారు. ఇది టోర్నీ తర్వాత కీలకంగా మారే అవకాశం ఉంది.
25 ఏళ్లకే ప్రపంచ రికార్డు - క్రికెట్లోనే ఆ ఘనత సాధించిన తొలి ప్లేయర్ రచినే