ETV Bharat / sports

సెమీస్ రేస్​ నుంచి పాకిస్థాన్ ఔట్!- ఖాతాలో 'చెత్త రికార్డులు' - CHAMPIONS TROPHY 2025

ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్థాన్ ఔట్!- ఆతిథ్య జట్టు ఖాతాలో చెత్త రికార్డులు

Pakistan Champions Trophy
Pakistan Champions Trophy (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Feb 25, 2025, 12:15 PM IST

Pakistan Champions Trophy 2025 : డిఫెండిగ్ ఛాంపియన్ హోదాలో ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగిన పాకిస్థాన్​కు షాక్ తగిలింది. తొలి మ్యాచ్​లో న్యూజిలాండ్​తో ఓడిన పాక్, భారత్​తో ఆడిన రెండో మ్యాచ్​లోనూ పరాజయం పాలైంది. అలా ఈ టోర్నీలో ఇప్పటివరకు​ ఆడిన రెండు మ్యాచ్​ల్లోనూ ఓడి, సెమీస్​ చేరకుండానే ఇంటిముఖం పట్టింది. సోమవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ గెలిస్తే పాక్ సెమీస్ ఆశలు సజీవంగానే ఉండేవే.

కానీ, బంగ్లాను ఓడించిన కివీస్ తమతోపాటు భారత్ సెమీస్ బెర్త్​ను కన్ఫార్మ్ చేసింది. అలా 29 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సొంత గడ్డపై ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్‌, కనీసం సెమీ ఫైనల్​ దాకా చేరకుండానే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించడాన్ని పాకిస్థానీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ పలు చెత్త రికార్డులను మూటగట్టుకుంది. అవేంటంటే?

16ఏళ్ల తర్వాత తొలిసారి
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించడం గత 16 ఏళ్లలో ఇదే తొలిసారి. అంతకుముందు 2009 ఎడిషన్​కు ఆతిథ్యమిచ్చిన సౌతాఫ్రికాకు ఇదే పరిస్థితి ఎదురైంది. 2009 ఛాంపియన్స్ ట్రోఫీలో సఫారీ జట్టు మూడు మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో నెగ్గి, మిగిలిన రెండింటిలో ఓడారు. దీంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచి లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించారు.

ఆ హోదాలో ఉన్నా!
ఈ టోర్నీలో పాక్​ డిఫెండింగ్ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగింది. కానీ, ఈసారి సెమీస్ చేరకుండానే గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఇలా డిఫెండింగ్ ఛాంప్​ హోదాలో బరిలోకి దిగి సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించిన నాలుగో జట్టుగా పాకిస్థాన్‌ మరో చెత్త రికార్డు మూటగట్టుకుంది. 2004లో భారత్, శ్రీలంక కూడా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. 2013 ఎడిషన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన కంగారులు ఒక్క మ్యాచ్‌లోనూ గెలవకుండా లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టారు.

కాగా, లీగ్ దశలో పాకిస్థాన్ తమ మూడో మ్యాచ్​లో బంగ్లాదేశ్​ను ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్​ గురువారం జరగనుంది. ఈ మ్యాచ్ ఫలితం సెమీస్​పై ఎలాంటి ప్రభావం చూపకున్నా పాకిస్థాన్ పరువు కాపాడుకునేందుకైనా నెగ్గాల్సి ఉంది.

భారత్ దెబ్బకు పాక్​ విలవిల- స్టేడియాలు నిండవు, స్పాన్సర్లు రారు!- పగోడికి కూడా ఈ కష్టం రాదు

ప్రాక్టీస్‌కు డుమ్మా​! - భారత్​తో మ్యాచ్​కు బాబర్ డౌట్​! - పాక్​కు మరో దెబ్బ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.