ETV Bharat / sports

కొత్త బ్యాట్​తో బరిలోకి ధోనీ- ఇక ధనాధన్ బౌండరీలే! - MS DHONI IPL 2025

2025 ఐపీఎల్​కు సిద్ధమవుతున్న ధోనీ- కొత్త బ్యాట్లతో బరిలోకి సై

Ms Dhoni IPL
Ms Dhoni IPL (Source : Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Feb 25, 2025, 2:04 PM IST

Ms Dhoni New Bat : మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ 2025 ఐపీఎల్ సీజన్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడు. ఈ సీజన్​లో ధోనీ అన్​క్యాప్డ్​ ప్లేయర్​గా చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగనున్నాడు. మైదానంలో మహీ బ్యాటింగ్ చూసేందుకు అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో 'తల' గురించి ఓ క్రేజీ న్యూల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 2025 ఐపీఎల్ సీజన్​లో ధోనీ కొత్త బ్యాట్ ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.

తేలికైన బ్యాట్​తో
ఈ సీజన్​కు ధోనీ కొత్త బ్యాట్​తో బరిలోకి దిగనున్నాడట. అయితే సాధారణంగా ధోనీ బ్యాట్ బరువు 1250-1300 గ్రాములు. ఈసారి బ్యాట్ బరువును కాస్త తగ్గించుకోవచ్చని తెలుస్తోంది. కనీసం 10- 20 గ్రాములు తగ్గించుకుంటాడని కథనాలు వస్తున్నాయి. గతంలో కంటే తక్కువ బరువున్న బ్యాట్​తో ఈసారి మిస్టర్ కూల్ ఐపీఎల్ బరిలో దిగనున్నాడన్న మాట. మేరఠ్​కు చెందిన సాన్స్‌ పరీల్స్ గ్రీన్‌ ల్యాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ధోనీకి ఇటీవలే నాలుగు బ్యాట్లను డెలివరీ చేసిందని తెలిసింది. ప్రతీ బ్యాట్ బరువు దాదాపు 1230 గ్రాములు ఉంటుందని సమాచారం. కాగా, కెరీర్​లో ధోనీ అత్యంత బరువున్న బ్యాట్ ను వాడిన క్రికెటర్​గా పేరొందాడు.

రాంచీలో ప్రాక్టీస్
ధోనీ ప్రస్తుతం రాంచీలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. బౌలింగ్ మెషీన్ వేసిన బంతులకు సాధన చేస్తున్నాడు. ఈ మేరకు ఝార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు తెలిపారు. ఇందౌర్ స్టేడియంలో మ్యాచ్​లు లేకపోవడం వల్ల ధోనీ బౌలింగ్ మెషీన్​తో ప్రాక్టీస్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఇక్కడ ఓ టోర్నీలో ధోనీ టెన్నిస్​ బంతితో మ్యాచ్ ఆడాడని వెల్లడించాడు.

మరోవైపు ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సీఎస్కే నిర్వహించే ప్రీ-ఐపీఎల్ ప్రాక్టీస్ శిబిరానికి ధోనీ హాజరవుతాడని తెలుస్తోంది. ఎంఏ చిదంబరం స్టేడియాన్ని ప్రాక్టీస్ కోసం సీఎస్కేకి మార్చి 10కల్లా అప్పగించనుందని సమాచారం. అప్పుడే చెన్నై జట్టు ప్రాక్టీసు శిబిరాలు ప్రారంభమవుతాయని సీఎస్కే వర్గాలు తెలిపాయి. శిక్షణ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని పేర్కొన్నాయి.

కాగా, గత ఐపీఎల్ సీజన్​లో ధోనీ ఎక్కువగా ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్​కు దిగాడు. ఆ సీజన్​లో కొన్ని మెరుపు ఇన్నింగ్స్​లు ఆడాడు. డెత్​ ఓవర్లలో సిక్సర్ల వర్షం కురిపించి జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. ఈ ఏడాది బ్యాటింగ్ ఆర్డర్​లో మరింత ముందొచ్చి రాణించాలని మిస్టర్ కూల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎల్లో జెర్సీలో లైవ్ మ్యాచ్ చూస్తున్న ధోనీ- షూటింగ్​కు బ్రేక్ ఇచ్చి మరీ!

'కెప్టెన్​గా కూల్​,​ ఫ్యాన్​గా హాట్​హాట్'- ఛాంపియన్స్ ట్రోఫీ ప్రోమో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.