How to Apply for Birth Certificate : విద్యార్థులకు అపార్ కార్డు ఆన్‌లైన్ నమోదు చేయడం తప్పనిసరి. కాని బర్త్ సర్టిఫికేట్లో అనేక మంది విద్యార్థుల పుట్టిన తేదీ, ఇంటి పేరు, పూర్తి పేరులో అక్షరాలు తప్పుగా ఉండటంతో సరిచేసుకోవడానికి వారి తల్లిదండ్రులు మీసేవ కేంద్రాలతో పాటు జన్మించిన హాస్పిటల్ చుట్టు చక్కర్లు కొడుతూ సరిచేయించుకుంటున్నారు. అసలు తప్పులు లేకుండా బర్త్ సర్టిఫికేట్ ఎలా పొందాలనే దానిపై ప్రత్యేక కథనం.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? : -
- వివాహం అయిన కొత్త జంట పెళ్లి ధ్రువపత్రం తీసుకునే టైంలో అప్రమత్తంగా ఉండాలి.
- నవవధువు వివాహానికి ముందు పుట్టింటి వద్ద ఉన్న పేరు పెళ్లి తరువాత అత్తింటి వద్ద మారిన పేరు సరిగా ఉన్నాయా? లేదా? అనేది చూసుకోవాలి.
- ప్రసవం కోసం హాస్పిటల్కి వెళ్లే టైంలో భార్యాభర్తల పేర్లు సరిగా ఉన్న ఆధార్ కార్డు, ఇతర ధ్రువపత్రాలు తీసుకెళ్లాలి. బిడ్డ పుట్టిన సంతోషంలో చాలా మంది బర్త్ సర్టిఫికెట్ గురించి ఆలోచించరు.
- ఇదే సమయంలో ఆసుపత్రి సిబ్బంది సర్టిఫికెట్ ఇచ్చేందుకు తల్లిదండ్రుల పేర్లు, వివరాలు అడుగుతారు. అలా అడిగినప్పుడు వెంట తీసుకెళ్లిన ఆధార్ కార్టుతో పాటు పెళ్లి ధ్రువపత్రాలు చూపించి పేర్లు సరిగ్గా నమోదు చేసేలా జాగ్రత్తలు తీసుకొని ఆసుపత్రి నుంచి బర్త్ సర్టిఫికెట్ పొందాలి.
- అనంతరం జనన ధ్రువపత్రం కోసం మీసేవలో దరఖాస్తు చేసే టైంలో పుట్టిన బిడ్డ వివరాలను పూర్తి పేరుతో నమోదు చేయించాలి. అనంతరం బిడ్డ తల్లిదండ్రుల వివరాలు అందించాలి.
- పై విధంగా చేస్తే ఎలాంటి తప్పులు లేకుండా పిల్లల బర్త్ సర్టిఫికెట్ పొందొచ్చు.
ఈ తప్పులు చేయొద్దు : -
- పిల్లలను అంగన్‌వాడీ కేంద్రం లేదా పాఠశాలలో చేర్పించే టైంలో నోటిమాటగా విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, గ్రామం పేరు చెబుతారు.
- అనంతరం ఏదైనా పని పడితే గాని పదో తరగతి వరకు మరలా ఆ విద్యార్థి పేరు రికార్డులో సరిగా ఉందో లేదా చెక్ చేసుకోరు.
- ఆ రికార్డు సరిచేసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- ప్రతి సంవత్సరం బోనఫైడ్ సర్టిఫికేట్ తీసుకుంటే తప్పులను ముందుగానే తెలుసుకోవచ్చు. ప్రాథమిక స్థాయిలోనే తప్పులను సరిచేసుకోవచ్చు.
ఇంకా బర్త్ సర్టిఫికెట్ తీసుకోలేదా? - కచ్చితంగా అవసరం - ఇలా అప్లై చేసుకోండి!
బర్త్, డెత్ సర్టిఫికెట్స్ కోసం కేంద్రం CRS యాప్- ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా?