తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ - పీసీబీ వైఖరిపై పాక్ ప్రభుత్వం కీలక నిర్ణయం! - CHAMPIONS TROPHY 2025

ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయమై పాక్ ప్రభుత్వం ఏం చెబుతోందంటే?

Champions Trophy 2025
Champions Trophy 2025 (source ANI And IANS)

By ETV Bharat Sports Team

Published : Nov 13, 2024, 3:37 PM IST

Champions Trophy 2025 : ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 పాకిస్థానే నిర్వహిస్తుందా? లేదంటే మరో దేశానికి అతిథ్య హక్కులు వెళ్లిపోతాయా? అనేది ప్రస్తుతం ఇప్పుడు క్రికెట్ ప్రియుల మదిలో మెదులుతోన్న ప్రశ్న, సందేహం. ఎందుకంటే పాకిస్థాన్​కు వెళ్లడం భారత్​కు ఇష్టం లేదు. ఇదే సమయంలో తమ దేశానికి భారత్​ రావాలని పాకిస్థాన్ మెండిపట్టు పడుతోంది.

ఇంకోవైపు దాయాది దేశాల మధ్య ఉన్న విభేధాల కారణంగా హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీని నిర్వహించాలని పీసీబీకి ఐసీసీ సూచిస్తోంది. కానీ పీసీబీ, ఐసీసీ మాటను వినేటట్టు లేదు. ససేమిరా అంటూ పట్టుదలనే ప్రదర్శిస్తోంది.

అయితే ఇప్పుడు ఇదే విషయాన్ని తమ దేశ ప్రభుత్వానికి కూడా పీసీబీ నివేదించిందని తెలిసింది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో పాక్‌ ప్రభుత్వం కూడా పీసీబీకి అనుకూలంగానే వ్యవహరిస్తోందట.

ఒకవేళ పాకిస్థాన్‌ ఆతిథ్యమిస్తే ఒక్క మ్యాచ్‌ కూడా బయట దేశాల్లో నిర్వహించొద్దని దాయాది ప్రభుత్వం పీసీబీకు క్లారిటీ ఇచ్చిందట. స్వదేశంలోనే పూర్తి టోర్నీ జరగాలని చెప్పిందట.

"మా గవర్నమెంట్​​ నుంచి మాకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. ఒక్క మ్యాచ్‌ కోసం కూడా బయటకు వెళ్లేందుకు అనుమతించే ప్రసక్తే లేదు. మేం ఇప్పటికే మా నిర్ణయం ఏంటో కచ్చితంగా చెప్పేశాం. భారత్ నిర్ణయం ఏంటో కూడా ఐసీసీ మాకు చెప్పింది. ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించే హక్కులు మా దగ్గరే ఉన్నాయి. కాబట్టి పాక్‌ బయట ఒక్క మ్యాచ్‌ను కూడా నిర్వహించేది లేదు" అని పీసీబీ వర్గాలు పేర్కొన్నాయి.

కాగా, పీసీబీ ఇదే పట్టుదలతో హోస్ట్‌ అవకాశాన్ని ఐసీసీ మరో దేశానికి అప్పగించే అవకాశం ఉందని కొత్త ప్రచారం మొదలైంది. దక్షిణాఫ్రికా లేదా యూఏఈలో నిర్వహిస్తారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు భారత్‌ లేకుండా మెగా టోర్నీ నిర్వహిస్తే పాక్​కు ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు అని కూడా అంటున్నారు. ఎందుకంటే భారత్ - పాకిస్థాన్‌ (IND vs PAK) జట్ల మధ్య మ్యాచ్‌ను చూసేందుకు ప్రపంచంలోని క్రికెట్ అభిమానులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ముఖ్యంగా భారత్ అడే ప్రతీ మ్యాచ్​ను ఎక్కువగా వీక్షిస్తుంటారు. పైగా ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం పంపించిన ముసాయిదా షెడ్యూల్‌లోనూ పాక్​-భారత్​ జట్లు ఒకే గ్రూప్‌లోనే ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.

భారత్ లేకుండా ICC టోర్నీయే లేదు- రికార్డులు చూస్తే ఔను అనాల్సిందే!

ఆసీస్​ గడ్డపై గర్జించిన టాప్​ 5 భారత టెస్ట్​ కెప్టెన్లు వీరే! - విజయ శాతం ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details