IND VS AUS Josh Hazlewood Injury :బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన మొదటి టెస్టులోనే ఘోర ఓటమిని అందుకున్న ఆస్ట్రేలియాకు మరో బిగ్ షాక్ తగిలింది. కీలక బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ రెండో టెస్టుకు దూరం కానున్నాడు. గాయం కారణంగా అతడు అందుబాటులో ఉండట్లేదు. రికవరీ అయ్యే వరకు అతడిని వైద్య బృందం పర్యవేక్షిస్తుందని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.
"నడుము కింది భాగంలో నొప్పి వచ్చినట్లు టీమ్ మేనేజ్‌మెంట్ దృష్టికి హేజిల్‌వుడ్ తీసుకొచ్చాడు. అతడిని పరీక్షించిన డాక్టర్స్ రెస్ట్ అవసరమని సూచించారు" అని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. దీంతో హేజిల్‌వుడ్ రెండో టెస్టులో ఆడకపోవచ్చని క్రికెట్ వర్గాలు తెలిపాయి. పరిస్థితి మెరుగుకాకపోతే పూర్తి సిరీస్‌కే దూరమయ్యే అవకాశం ఉందని చెప్పాయి. కాగా, పెర్త్ టెస్టులో ఐదు వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు. మిగతా ఆసీస్ బౌలర్ల కన్నా ఉత్తమ కనబరిచాడు. అడిలైడ్ వేదికగా పింక్‌బాల్ (డే/నైట్) టెస్టు డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానుంది.
వారికి అవకాశం - జోష్ హేజిల్‌వుడ్ గైర్హాజరీ అవ్వడం వల్ల కొత్తగా ఇద్దరికి జట్టులో చోటు దక్కింది. సీన్ అబాట్, డొగ్గెట్‌ను సెలెక్ట్ చేశారు. ప్రైమ్‌మినిస్టర్స్ XI టీమ్‌లో ఉన్న బోలాండ్ కూడా ఆసీస్ జట్టులో ఉన్నాడు. అతడు ఈ వార్మప్ మ్యాచ్‌లో అతడు సత్తా చాటితో భారత్‌తో రెండో టెస్టు తుది జట్టులో అతడు ఆడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.