Bumrah Suggestions Siraj : టీమ్‌ఇండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ ఇటీవల సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే ఆస్ట్రేలియా సిరీస్‌లో మాత్రం సిరాజ్ అద్భుతంగా పుంజుకున్నాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 5 వికెట్లు పడగొట్టి విమర్శలకు చెక్ పెట్టాడు. ఈ క్రమంలో తాను ఇంత త్వరగా కమ్ బ్యాక్ ఇవ్వడం వెనక స్టార్ పేసర్ బుమ్రా ఉన్నట్లు పేర్కొన్నాడు. ఈ క్రెడిట్ అంతా బుమ్రాకే దక్కుతుందని తెలిపాడు.
'బుమ్రాతో నేను తరతూ మాట్లాడుతుంటా. తొలి మ్యాచ్‌కు ముందు కూడాఅతడితో మాట్లాడాను. బౌలింగ్‌లో నేను ఎదుర్కొంటున్న పరిస్థితిని బుమ్రాకు వివరించాను. అతడు చెప్పిందల్లా ఒకటే. 'వికెట్ల కోసం పరిగెత్తకు. ఒకే ప్రాంతంలో నిలకడగా బంతులు వేయడానికి ప్రయత్నించు. నీ బౌలింగ్‌ను నువ్వు ఆస్వాదించు. అప్పటికీ వికెట్లు దక్కకపోతే మళ్లీ నా దగ్గరికి రా' అని భరోసా ఇచ్చాడు. దీంతో నా బౌలింగ్ మార్చుకున్నాను. నా బౌలింగ్ నేను ఎంజాయ్ చేశా. దీంతో వికెట్లు తీయగలిగాను' అని చెప్పాడు. ఇక మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కూడా తనకు మంచి సలహాలు ఇచ్చాడని, తన బౌలింగ్‌ను అతడు చాలాకాలం నుంచి గమనిస్తున్నాడని సిరాజ్ తెలిపాడు.
🗣️ " the more i enjoy my bowling, the more wickets i'll take."
— BCCI (@BCCI) December 2, 2024
mohd. siraj reflects on finding his form in australia and shares how chats with jasprit bumrah have helped him. 👌#TeamIndia | #AUSvIND | @mdsirajofficial | @Jaspritbumrah93 pic.twitter.com/bboY3C7HAj
కాగా, ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సిరీజ్ పూర్తిగా తేలిపోయాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో సిరాజ్ కేవలం రెండు వికెట్లే తీశాడు. ఆ తర్వాత ఆసీస్‌తో సిరీస్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చి తొలి టెస్టులోనే ఐదు వికెట్లు పడగొట్టాడు. తొలి టెస్టు కెప్టెన్, స్టార్ పేసర్ బుమ్రా ఇచ్చిన సలహాలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపాడు.