LIVE: హైదరాబాద్​లో ఆరోగ్య ఉత్సవాలు - పాల్గొన్న సీఎం రేవంత్​ రెడ్డి - CM REVANTH REDDY LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 2, 2024, 4:48 PM IST

Updated : Dec 2, 2024, 5:59 PM IST

CM Revanth Reddy Live : హైదరాబాద్​లోని ఎన్టీఆర్ మార్గ్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న ఆరోగ్య ఉత్సవాలను సీఎం రేవంత్​ రెడ్డి ప్రారంభించారు. ప్రజాపాలన - ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్​ పాల్గొన్నారు. 108 కోసం 136 అంబులెన్స్​లను జెండా ఊపి సీఎం ప్రారంభించారు. అలాగే 102 కోసం 77 అంబులెన్స్​లకు జెండా ఊపి సీఎం ప్రారంభించారు. అంతకు ముందు సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండ తిమ్మాపూర్ లో ఏర్పాటు చేసిన కోకో కోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంటును పరిశ్రమను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కోకోకోలా, థమ్స్​అప్ లాంటి శీతల పానీయాలను ఉత్పత్తి చేసే హిందుస్థాన్ బివరేజెస్ సంస్థ బండ తిమ్మాపూర్ ఫుడ్ పార్కులో నిర్మించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్లాంట్ పూర్తి చేసారు. దాదాపు 1,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ గ్రీన్ ఫీల్డ్ బాట్లింగ్ ప్లాంట్ ఇటీవలె నిర్మాణం పూర్తి చేసుకుంది.
Last Updated : Dec 2, 2024, 5:59 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.