Big Bash League 2024 Winners:ఆస్ట్రేలియా డొమెస్టిక్ టోర్నమెంట్ బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ 2024 ఎడిషన్ ఛాంపియన్స్‌గా నిలించింది. బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్- బ్రిస్బేన్ హీట్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బ్రిస్బేన్ జట్టు 54 పరుగులు తేడాతో నెగ్గి సీజన్ 13 విజేతగా నిలిచింది. కాగా, బ్రిస్బేన్ బిగ్‌బాష్ ఛాంపియన్‌గా నిలవడం ఇది రెండోసారి. 2012లో తొలిసారి టైటిల్ నెగ్గింది. ఇక విజేతగా నిలిచిన జట్టుకు రూ. 2.75 కోట్లు, రన్నరప్‌కు రూ.1.37 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఓపెనర్ జోశ్ బ్రౌన్ (50), రెన్షా (40) రాణించారు. సిడ్నీ బౌలర్లలో అబాట్ 4, ఓకెఫీ, ద్వార్షిస్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం ఛేజింగ్‌కు దిగిన సిడ్నీ సిక్సర్ జట్టు 17.3 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది. స్పెన్సర్ జాన్సన్ 4 వికెట్లతో సిడ్నీని దెబ్బకొట్టాడు. బార్లెట్, మిచెల్ స్వెప్సన్ తలో రెండు, మిచెల్ నజీర్, పాల్ వాల్టర్ చెరో ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
ఈ టోర్నీలో మరికొన్ని రికార్డ్‌లు
- అత్యధిక పరుగులు- మ్యాథ్యూ షాట్ (541 పరుగులు, ఆడిలైడ్ స్ట్రైకర్స్)
- అత్యధిక సిక్స్‌లు- మ్యాథ్యూ షాట్ (25 సిక్స్‌లు, ఆడిలైడ్ స్ట్రైకర్స్)
- అత్యధిక వికెట్లు- బార్లెట్ (20 వికెట్లు, బ్రిస్బేన్ హీట్)
- అత్యధిక క్యాచ్‌లు- మిచెల్ నాజీర్ (11 క్యాచ్‌లు, బ్రిస్బేన్ హీట్)