తెలంగాణ

telangana

ETV Bharat / sports

మహిళల క్రికెట్​లో ప్రపంచ రికార్డు - 390 ర‌న్స్ ఊదేసిన టీమ్ - HIGHEST RUN CHASE WOMEN CRICKET

బంగాల్ మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు ప్ర‌పంచ రికార్డు - అత్యధిక పరుగులు ఛేదించిన జట్టుగా రికార్డు

Highest Run Chase Women Cricket
Highest Run Chase Women Cricket (source Getty Images)

By ETV Bharat Sports Team

Published : Dec 24, 2024, 10:14 AM IST

Highest Run Chase Women Cricket : మహిళల వన్డే క్రికెట్‌ చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా బంగాల్‌ రికార్డు సృష్టించింది. సీనియర్‌ మహిళల వన్డే టోర్నీలో సోమవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో హరియాణా నిర్దేశించిన 390 పరుగుల లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ క్రమంలో బంగాల్ ప్రపంచ రికార్డును క్రియేట్ చేసింది. లిస్టు-ఏ మ‌హిళ‌ల క్రికెట్​లో ఇదే రికార్డు విజ‌యం. గ‌తంలో న్యూజిలాండ్ స్వ‌దేశీ క్రికెట్​లో క్యాంట్‌ బెరిపై 309 ర‌న్స్ ఛేజ్ చేసి నార్త‌ర్న్ డిస్ట్రిక్ట్స్ విజ‌యం సాధించింది. ఇప్పుడు ఆ రికార్డును బంగాల్ బ‌ద్ద‌లు కొట్టింది.

శ్రీలంక పేరిట భారీ రికార్డు
మ‌హిళల అంత‌ర్జాతీయ వ‌న్డేల్లో శ్రీలంక పేరిట భారీ విక్ట‌రీ రికార్డు ఉంది. ద‌క్షిణాఫ్రికాపై 305 ర‌న్స్ చేజ్ చేసి శ్రీలంక రికార్డు కొట్టింది. భార‌తీయ డొమెస్టిక్ క్రికెట్​లో గ‌తంలో రైల్వేస్ జ‌ట్టు అత్య‌ధికంగా 356 ర‌న్స్ చేసింది.

భారీ లక్ష్యం విధించిన హరియాణా
రాజ్‌ కోట్‌లోని నిరంజ‌న్ షా స్టేడియంలో బంగాల్, హరియాణా జట్ల మధ్య సోమవారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్​లో బ్యాటింగ్ చేసిన హ‌రియాణా నిర్ణీత ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 389 ర‌న్స్ చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో ష‌ఫాలీ వ‌ర్మ అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడింది. ఆమె 115 బంతుల్లో 197 ర‌న్స్ కొట్టి త్రుటిలో డబుల్‌ సెంచరీ చేజార్చుకొంది. ఆమె ఇన్నింగ్స్‌లో 22 ఫోర్లు, 11 సిక్స‌ర్లు ఉన్నాయి. అలాగే సోనియా మెహందియా(61), రీమా సిసోడియా(58) రాణించారు. సీనియ‌ర్ మ‌హిళా క్రికెట్ టోర్నీల్లో ఈ ఏడాది ష‌ఫాలీకి ఇదో రెండో సెంచ‌రీ. యూపీపై ఆమె 98 బంతుల్లో 139 ర‌న్స్ చేసింది.

సునాయాశంగా ఛేదన
390 పరుగుల లక్ష్య ఛేదనను సునాయాశంగా ఛేదించింది బంగాల్ జట్టు. తనుశ్రీ సర్కారు(113) సెంచరీకి తోడు ప్రియాంక(88 నాటౌట్), ధర గుజ్జార్(69), సస్తీ మోండల్(52) సత్తాచాటడంతో బంగాల్ భారీ లక్ష్యాన్ని 49.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 390 పరుగులు చేసి గెలిచింది. బంగాల్ మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే విజయతీరాలకు చేరింది.

అశ్విన్ స్థానంలో 26 ఏళ్ల స్పిన్నర్​ - ఎవరీ తనుష్ కోటియన్?

మను బాకర్‌కు దక్కని చోటు - 'ఖేల్‌ రత్న' నామినేషన్లపై మొదలైన వివాదం!

ABOUT THE AUTHOR

...view details