తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంపాక్ట్ రూల్​పై BCCI రివ్యూ- ఆ టోర్నీలోపే క్లారిటీ! - BCCI Rules - BCCI RULES

Impact Rule BCCI: 2025 ఐపీఎల్​లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ అవసరం లేదని కొందరు క్రీడా విశ్లేషకుల అభిప్రాయం. అదే సమయంలో ఈ నిబంధన ఉండాల్సిందేని మరికొందరు చెబుతున్నారు. మరి అది వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఉంటుందా? లేదా?

BCCI Rules
BCCI Rules (Source: Getty Images)

By ETV Bharat Sports Team

Published : Aug 31, 2024, 4:34 PM IST

Impact Rule BCCI:డొమెస్టిక్ క్రికెట్​లో కొనసాగుతున్న రెండు నిబంధనల గురించి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అందులో ఒకటి ఇంపాక్ట్ రూల్ కాగా, మరోకటి ఒకే ఓవర్‌లో రెండు బౌన్సర్ల నిబంధన. ఈ రెండు రూల్స్​పై క్రికెట్ వర్గాల నుంచి ఇప్పటికే మిశ్రమ స్పందనలు వచ్చాయి. లిమిటెడ్ ఓవర్ల క్రికెట్‌లో రెండు బౌన్సర్లకు అనుమతివ్వడంపై సానుకూలంగా ఉన్నప్పటికీ, అది ఇంటర్నేషనల్​ మ్యాచ్​ల్లో లేదనే వాదనా ఉంది. అంతర్జాతీయ క్రికెట్​లో ఒక ఓవర్​లో కేవలం ఒక్క బౌన్సరే అనుమతి ఉంది. మరోవైపు ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ వద్దని కొందరు అంటుండగా, మరికొందరు దాంతో ప్రయోజనాలు చెబుతున్నారు. దీంతో ఈ రెండు నిబంధనలపై త్వరలోనే రివ్యూ నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 నవంబర్‌లో ప్రారంభం కానుంది. ఇది టీ20 ఫార్మాట్‌లో జరిగే డొమెస్టిక్ టోర్నీ. గత సీజన్‌లో రెండు బౌన్సర్ల రూల్‌ను అనుమతించారు. మరి ఈసారి అది కొనసాగుతుందా? లేదా? అనేది ఆయా రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్​లకు అనుమానంగా ఉంది. బీసీసీఐ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతి ఓవర్‌లో రెండో బౌన్సర్‌ను బౌలర్లు చక్కగా వినియోగించుకొని ఆశించిన మేర ఫలితాలు అందుకున్నారు.

ఇక ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ ఐపీఎల్‌లోనూ సక్సెస్‌ అయింది. కానీ, దీనివల్ల ఆల్‌రౌండర్లకు అన్యాయం జరుగుతుందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ గతంలోనే తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. అయితే లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ కొత్త మెంటార్‌గా నియమితులైన జహీర్‌ ఖాన్ ఇందుకు భిన్నంగా స్పందించాడు. అసలైన ఆల్‌రౌండర్లను ఈ రూల్‌ ఆపబోదని ఇటీవల జహీర్ పేర్కొన్నాడు. దీంతో సయ్యద్ ట్రోఫీ ప్రారంభంలోగానే బీసీసీఐ సమీక్షించి నిర్ణయం తీసుకుంటుందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే దేశవాళీ టోర్నీలకు సంబంధించి భవిష్యత్ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. కానీ, టోర్నీల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా రాలేదు. దీంతో స్టేట్‌ క్రికెట్ అసోసియేషన్​లు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాయి.

'ఇంపాక్ట్‌ ప్లేయర్‌, రెండు బౌన్సర్ల నిబంధనలపై పెద్దఎత్తున చర్చ సాగుతోంది. అదేవిధంగా ఐపీఎల్‌ 2025 సీజన్‌కు సంబంధించి మెగా వేలం నిర్వహణపైనా ఫ్రాంచైజీలు ఒత్తిడి తెస్తున్నాయి. రైట్‌ టు మ్యాచ్‌ నిబంధన వద్దని చాలామంది డిమాండ్ చేశారు. ఇప్పటివరకు బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దేశవాళీ క్రికెట్‌ టోర్నీ ప్రారంభంలోపే దీనిపై స్పష్టత వస్తుంది' అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

'ఇప్పట్లో నో రిటైర్మెంట్- వరల్డ్​ క్రికెట్​లో నా ఇంపాక్ట్ చూపిస్తా' - Rohit Sharma Retirement

ఇంపాక్ట్ రూల్​ వల్లే రింకూ సింగ్​కు జట్టులో చోటు దక్కలేదా? - T20 World Cup 2024

ABOUT THE AUTHOR

...view details