ICC Womens Championship :ఐసీసీ మహిళల ఛాంపియన్షిప్ టైటిల్‌ను ఆస్ట్రేలియా దక్కించుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో 75 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో ఐసీసీ మహిళల ఛాంపియన్ షిప్ టైటిల్‌ను ఆసీస్ దక్కించుకుంది. 24 మ్యాచుల ఐసీసీ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పాయింట్లు సాధించి మూడోసారి ఆసీస్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో భారత్ ఎన్నో ప్లేస్‌లో ఉంది? ఇతర జట్ల పరిస్థితి ఏంటి? తదితర విషయాలు తెలుసుకుందాం.
మూడో ప్లేస్‌లో భారత్
ఐసీసీ మహిళల ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ మూడో స్థానానికి చేరుకుంది. విండీస్‌పై తొలి వన్డేలో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో భారత్ 24 మ్యాచుల్లో 15 విజయాలను నమోదు చేసి 32 పాయింట్ల సాధించింది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో మూడో ప్లేస్‌లో నిలిచింది.
మహిళల క్రికెట్‌ను విస్తరించేందుకే!
మహిళా క్రికెట్‌ను మరింత విస్తరించి అభివృద్ధి చేసేందుకు ఐసీసీ ప్రతి మూడేళ్ల సీజన్ కోసం వన్డే ఛాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తోంది. ఈ ఛాంపియన్‌షిప్‌లో తొలి ఆరు స్థానాల్లో నిలిచిన జట్లు వన్డే ప్రపంచ కప్ టోర్నీకి నేరుగా క్వాలిఫై అవుతాయి. ఒకవేళ టాప్ -6లో లేకపోతే క్వాలిఫయర్ మ్యాచ్‌లను ఆడి అందులో అర్హత సాధిస్తే వరల్డ్ కప్ ఆడొచ్చు.
ప్రతి జట్టు 24 మ్యాచ్‌లు ఆడాలి
ఈ సీజన్లో ప్రతి జట్టూ 24 వన్డేలు ఆడాల్సి ఉంటుంది. అందులో ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టుకు ఛాంపియన్షిప్ టైటిల్ దక్కుతుంది. ఒక్కో మ్యాచ్ గెలిస్తే 2పాయింట్లు, ఎలాంటి ఫలితం రాకపోతే ఒక పాయింట్ ఆయా జట్లకు లభిస్తాయి.
తాజాగా జరిగిన మ్యాచ్‌తో ఆసీస్ , న్యూజిలాండ్ తమ 24 వన్డేల కోటాను పూర్తి చేసుకున్నాయి. భారత్‌కు ఇంకా 5, బంగ్లాకు 3, విండీస్ 5, ఐర్లాండ్‌కు 3 మ్యాచ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పాయింట్ల ప్రకారం ఆసీస్‌ను అధిగమించే అవకాశం మరే జట్టుకూ లేదు. దీంతో ఐసీసీ మహిళల ఛాంపియన్షిప్ టైటిల్ ఆసీస్ దక్కించుకుంది.
పాయింట్ల పట్టికలో టాప్ -6లో నిలిచిన టీమ్‌లు
ఆస్ట్రేలియా 24 మ్యాచుల్లో 18 విజయాలు సాధించింది. మూడు మ్యాచుల్లో ఎలాంటి ఫలితం రాలేదు. ఓవరాల్ లో 39 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.