Australia vs Scotland 2024:ఆస్ట్రేలియా- స్కాట్లాండ్ మధ్య టీ20 సిరీస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సిరీస్‌లో ఊహించని ఫలితాలు ఏవీ రాలేదు. అందరికీ తెలిసినట్లే ఆస్ట్రేలియా 3-0తో సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసింది. మరెందుకు హాట్ టాపిక్ అయ్యింది అనుకుంటున్నారా? ఎడిన్‌బర్గ్‌లో సిరీస్ విజేతలకు అందజేసిన కప్పును చూసి ఆస్ట్రేలియా ప్లేయర్లు షాక్ అయ్యారు. సిరీస్ పూర్తయ్యాక ఆసీస్ ప్లేయర్లకు ట్రోఫీకి బదులు 'ఐస్‌క్రీమ్ కప్'ని పోలి ఉన్న ఓ గిన్నే (Bowl)ను ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆసీస్ ప్లేయర్లంతా నవ్వుల్లో మునిగిపోయారు.
ఆ ట్రోఫీ ఏంటంటే?
స్కాట్‌లాండ్‌లో ఈ ప్రత్యేక వస్తువును 'క్వాయిచ్ (Quaich)' అని పిలుస్తారు. ఈ మినీ- బౌల్‌ని ట్రెడిషినల్‌గా విస్కీ లేదా ఇతర పానీయాలను తాగడానికి ఉపయోగిస్తారు.
నవ్వుల్లో మునిగిపోయిన ఆస్ట్రేలియా
కెప్టెన్ మిచెల్ మార్ష్‌కి ప్రెజెంటర్ ట్రోఫీని అందజేయగా, జట్టు మొత్తం నవ్వుల్లో మునిగిపోయింది. మార్ష్ కూడా నవ్వును దాచుకోలేకపోయాడు. కప్పు అందిస్తుండగా కాస్త కన్ఫ్యూజ్ అయ్యాడు. ట్రోఫీని వింతగా చూశాడు. విషయం అర్థమయ్యాక నవ్వుతూ కప్పు పట్టుకొన్నాడు. అనంతరం ప్లేయర్లంతా అందరూ ఫోటో కోసం గుమిగూడారు. ఆ విచిత్రమైన ట్రోఫీతో ఎలా పోజులివ్వాలో తెలియక తికమక పడటం మరింత నవ్వు తెప్పించింది.