తెలంగాణ

telangana

ETV Bharat / sports

పుణె స్టేడియంలో నీటి కష్టాలు- 100ML ఖరీదు రూ.80- డీ హైడ్రేషన్​తో కుప్పకూలిన సీనియర్ సిటిజన్లు! - INDIA VS NEW ZEALAND 2ND TEST

భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్​కు నీటి కొరత- స్టేడియంలో ప్రేక్షకుల ఇబ్బందులు

Ind vs Nz
Ind vs Nz (Source : Getty Images (File Photo))

By ETV Bharat Sports Team

Published : Oct 24, 2024, 5:08 PM IST

IND vs NZ 2nd Test 2024 :భారత్​- న్యూజిలాండ్ మధ్య పుణె వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. అయితే స్టేడియంలో నీటి కొరత ఏర్పడింది. తాగునీటి సదుపాయం లేకపోవడం వల్ల ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ)కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఎంసీఏ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పింది. అలాగే ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చింది.

ప్రేక్షకుల ఇబ్బందులు
ఈ మ్యాచ్ కోసం గురువారం పుణె స్టేడియానికి దాదాపు 18వేల మంది ప్రేక్షకులు వచ్చారు. స్టేడియంలోని చాలా స్టాండ్స్​లో పైకప్పులు లేకపోవడం వల్ల ప్రేక్షకులు ఎండకు ఇబ్బంది పడ్డారు. తొలి సెషన్ ముగిసిన తర్వాత స్టేడియంలోని వాటర్ స్టేషన్​కు వెళ్లారు. అక్కడ నీరు లేకపోవడం వల్ల ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఎంసీఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించింది.

100 మి.లీ రూ.80
స్టేడియంలో నీటి సదుపాయానికి అంతరాయం ఏర్పడడం వల్ల ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు సోషల్ మీడియాలోనూ ఎమ్​సీఏపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 'అక్టోబర్ నెలలో ఎండలు బాగా ఉంటాయి. అయినప్పటికీ స్టేడియంలో నీళ్లు అందుబాటులో లేవు. ఫ్యాన్స్​కు కనీస సౌకర్యాలు కల్పించలేనప్పుడు స్టేడియాల గురించి గొప్పగా చెప్పుకోవడం ఎందుకు? ' అని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక ఈ సందర్భాన్ని దుకాణాదారులు సొమ్ము చేసుకుంటున్నారని మరో నెటిజన్ అన్నారు. 'ఎమ్​సీఏ స్టేడియంలో నీళ్ల సరఫరా నిలిచిపోయి 2 గంటలు దాటింది. 100ML నీళ్లను రూ.80 దాకా విక్రయిస్తున్నరు. సీనియర్ సిటిజన్లు డీ హైడ్రేషన్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు త్వరగా చర్యలు తీసుకోవాలి' అని ట్విట్టర్​లో షేర్ చేశారు.

MCA క్షమాపణలు
'ప్రేక్షకులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలుపుతున్నాం. స్టేడియంలో మంచి నీటి సమస్యను పరిష్కరించాం. ఈసారి ప్రేక్షకులకు చల్లటి తాగునీటిని అందించాలని నిర్ణయించుకున్నాం. కానీ, భారీ రద్దీ కారణంగా లంఛ్ బ్రేక్ సమయానికి కొన్ని స్టాల్స్​లో నీరు అయిపోయింది. వాటర్ కంటైనర్లను రీఫిల్ చేయడానికి మాకు 15-20 నిమిషాలు పట్టింది. ఇంకా ఆలస్యం అవుతుందని వారికి ఉచితంగా వాటర్ బాటిల్స్ అందించాం' అని ఎంసీఏ కార్యదర్శి కమలేశ్ పిసల్ మీడియాకు తెలిపారు.

ట్రాఫిక్ రద్దీ వల్లే
పుణె నగర శివారులో స్టేడియం ఉండడంతో అక్కడకి నీరు తీసుకెళ్లే వాహనాలు ట్రాఫిక్​లో ఇరుకున్నట్లు తెలుస్తోంది. దీంతో స్టేడియంలో నీటికొరత ఏర్పడినట్లు సమాచారం.

రెస్ట్ కాదు - సిరాజ్​ను రెండో టెస్ట్​లో తీసుకోకపోవడానికి అసలు కారణమిదే!

తిప్పేసిన సుందర్- కివీస్ 259 ఆలౌట్

ABOUT THE AUTHOR

...view details