Ashes vs Border Gavaskar Trophy:ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఇటీవల బోర్డర్- గావస్కర్ ట్రోఫీని యాషెస్‌తో పోల్చడంతో ఆసక్తికర చర్చ మొదలైంది. భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్ గావస్కర్ సిరీస్ పోటీ ప్రాముఖ్యత పరంగా యాషెస్‌తో సమానమని స్టార్క్ పేర్కొన్నాడు. ఇది అతడి వ్యక్తిగత అభిప్రాయాన్నే కాకుండా టెస్టు క్రికెట్‌కి పెరుగుతున్న ఆదరణను కూడా సూచిస్తుంది. మరి స్టార్క్ అలా అనడానికి గల కారణాలు ఏంటంటే?
యాషెస్ ఘన చరిత్ర
క్రికెట్‌లో యాషెస్ చాలా కాలం నుంచి జరుగుతున్న ప్రతిష్ఠాత్మక పోటీ. దీనికి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1882 నుంచి అంటే ఒక శతాబ్దానికి పైగా ఇంగ్లాండ్- ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్‌లో తలపడుతున్నాయి. ఇరు దేశాలు ఈ సిరీస్‌ని గెలవడానికి తీవ్రంగా కృష్టి చేస్తాయి. ఈ ట్రోఫీని గెలవడం దేశానికి గర్వకారణంగా భావిస్తాయి. ఇంగ్లాండ్- ఆస్ట్రేలియాలో యాషెస్ కేవలం క్రికెట్ సిరీస్ మాత్రమే కాదు. లోతుగా పాతుకుపోయిన క్రీడా పోటీని సూచించే కల్చరల్ ఈవెంట్.
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ
అలానే టెస్టు క్రికెట్‌లో మరో ప్రముఖ సిరీస్ బోర్డర్- గావస్కర్ ట్రోఫీ. ఇందులో భారత్- ఆస్ట్రేలియా తలపడతాయి. యాషెస్‌తో పోలిస్తే ఈ సిరీస్ చాలా కొత్తది. అయినప్పటికీ బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఇటీవల సంవత్సరాల్లో అత్యంత ఉత్కంఠభరితమైన క్రికెట్‌ను అందించింది. స్వదేశంలో భారతదేశం ఆధిపత్యం చెలాయించడం, ఆస్ట్రేలియా దీటుగా సమాధానం చెప్పడం వంటివి సిరీస్‌పై ఆసక్తిని పెంచాయి. బోర్డర్- గావస్కర్ సిరీస్ ప్లేయర్స్ నైపుణ్యం, వ్యూహాలు, మానసిక దృఢత్వానికి నిజమైన పరీక్షగా మారింది.