Rohith Sharma Nita Ambani : దేశీయ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి పండగ వాతావరణ నెలకొన్న సంగతి తెలిసిందే. రెండో కుమారుడు అనంత్ అంబానీ సంగీత్ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అయితే ఈ వేడుకకు సినీ, క్రీడా ప్రముఖులు హాజరై సందడి చేశారు.
అయితే ఈ వేడుకలో ఓ స్పెషల్ మూమెంట్ చోటు చేసుకుంది. అదేంటంటే రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ వరల్డ్ కప్ విన్నింగ్ హీరోలు క్రికెటర్లను స్టేజ్‌పై ప్రత్యేకంగా అభినందించారు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.
మరో విషయమేమిటంటే ఐపీఎల్‌లో ముంబయి ఫ్రాంచైజీ నీతా అంబానీకి చెందినదే. అలానే రోహిత్, హార్దిక్, సూర్య - ఈ ముగ్గురూ ముంబయికే ఆడుతున్నారు. గతంలో ముంబయిని వదిలి గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్‌ను వెనక్కి రప్పించి మరీ సారథ్య బాధ్యతలు ఇచ్చారు నీతా. అప్పటివరకు సారథిగా ఉన్న రోహిత్ శర్మను తొలగించి మరీ ముంబయి ఇండియన్స్ కేప్టెన్సీ పగ్గాలను పాండ్యకు అప్పగించారు. కానీ రోహిత్ మాత్రం జట్టును వదలకుండా ప్లేయర్‌గా ఆడాడు.