Mohammad Nabi Retirement :అఫ్గానిస్థాన్ సీనియర్ ప్లేయర్ మహ్మద్ నబీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని డిసైడ్ అయ్యాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత నబీ వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకోనున్నాడు. తన నిర్ణయాన్ని నబీ ఇప్పటికే అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డుకు తెలిపాడు. తాజాగా ఈ విషయాన్ని అఫ్గాన్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యుటివ్ నసీబ్ ఖాన్ ధ్రువీకరించారు.
'ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత నబీ వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలకాలని డిసైడ్ అయ్యాడు. కొన్ని నెలల ముందే నబీ తన నిర్ణయాన్ని బోర్డుకు చెప్పాడు. తన నిర్ణయాన్ని బోర్డు గౌరవవిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత నబీ వన్డేలకు ముంగింపు పలికినా, టీ20 ఫార్మాట్లో ఆడతాడని ఆశిస్తున్నా' అని నసీబ్ ఖాన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా, 39ఏళ్ల నబీ అఫ్గాన్ జట్టులో అత్యంత సీనియర్ ప్లేయర్. అతడు 2009లో వన్డే మ్యాచ్‌తోనే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. దాదాపు 15ఏళ్ల కెరీర్లో నబీ 165 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. అందులో 3537 పరుగులు చేయగా, 171 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా నమోదు చేశాడు.