10 Runs 1 Ball :సౌతాఫ్రికా- బంగ్లాదేశ్ రెండో టెస్టులో అరుదైన సంఘటన జరిగింది. బంగ్లాదేశ్ ఒక్క బంతికే 10 పరుగులు చేసేంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటివి చాలా అదురు. ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. మరి ఇది ఎలా సాధ్యమైందంటే?
ఓపెనర్లు షాద్‌మన్ ఇస్లాం- మహ్మదుల్ హసన్ జాయ్ బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. సౌతాఫ్రికా పేసర్ కగిసో రబాడ తొలి ఓవర్ బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. తొలి బంతికి ఎలాంటి పరుగులు ఇవ్వలేదు. అయితే ఆ సమయంలో సౌతాఫ్రికా ప్లేయర్ సెనూరన్ ముత్తుసామి పిచ్‌పై పరుగెత్తాడు. దీంతో సౌతాఫ్రికా పెనాల్టీకి గురైంది. పెనాల్టీ రన్స్ కింద అంపైర్ బంగ్లాదేశ్‌కు ఐదు పరుగులు జోడించారు.
ఇక రబాడ రెండో బంతి నో బాల్ వేశాడు. బ్యాటర్ వెనకాల నుంచి వెళ్లిన ఆ బంతి కీపర్‌కు కూడా అందలేదు. దీంతో ఆ బంతి నేరుగా బౌండరీని తాకింది. ఇంకేముంది! బంగ్లాదేశ్ ఖాతాలో మరో ఐదు పరుగులు చేరాయి. అయితే లీగల్‌గా ఒక్క బంతి మాత్రమే పూర్తయ్యింది. అటు బంగ్లా స్కోరు బోర్డు 10-0కి చేరుకుంది. దీంతో ఒక్క బంతికి బంగ్లా 10 పరుగులు సాధించినట్లైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక్క బంతికే 10 పరుగులు సమర్పించుకోవడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే టెస్టు క్రికెట్‌లో ఇలాంటివి చాలా అరుదుగా కనిపిస్తాయి.