ETV Bharat / state

మద్యం ప్రియులకు షాక్ - తెలంగాణలో ఇక ఈ బీర్లు దొరకవ్ - UNITED BREWERIES STOPS SUPPLY

తెలంగాణకు బీర్ల సరఫరా నిలిపివేసిన యునైటెడ్‌ బ్రూవరీస్‌ లిమిటెడ్ - నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడి

UNITED BREWERIES
KINGFISHER BEER SUPPLY (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 8, 2025, 4:59 PM IST

Updated : Jan 8, 2025, 7:09 PM IST

Kingfisher Beers Supply stoped in Telangana : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ప్రియులకు షాక్​ తగిలింది. ఎందుకంటే తెలంగాణకు బీర్ల సరఫరా యునైటెడ్‌ బ్రూవరీస్‌ నిలిపివేసింది. దీంతో రాష్ట్రానికి ఏడు రకాలైన బీర్ల సరఫరా నిలిచిపోనుంది. గత ఐదేళ్లుగా ధరలు పెంచలేదని, అందువల్లే సరఫరా నిలిపివేస్తున్నట్లు యూనైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. గత 2019 నుంచి ఇప్పటి వరకు బీర్ల ధరలు పెంచలేదని ఆందోళన వ్యక్తం చేసింది.

కింగ్​ ఫిషర్​ వల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయం : తెలంగాణలో వినియోగిస్తున్న బీర్ల పరిమాణంలో 88 శాతం యునైటెడ్ బేవరిస్ సరఫరా చేస్తున్న కింగ్ ఫిషర్ బ్రాండ్ ఉన్నట్లు పేర్కొంది. ప్రతి సంవత్సరం తమ బీర్ల సరఫరా ద్వారా రూ. 4500 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెడుతున్నట్లు వివరించింది. ఉన్నపళంగా యూనైటెడ్ బీర్లు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్​కు సమాచారం అందించడంతో దీనిపై ప్రభుత్వం ఆరా తీసింది. రాష్ట్రంలో 80 శాతానికి పైగా మార్కెట్ ఉన్న కింగ్ ఫిషర్ బీర్లు ఆగిపోవడంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

KINGFISHER BEER SUPPLY
UNITED BREWERIES LETTER (ETV Bharat)

భారీ నష్టాల వల్లే : పెరిగిన ఉత్పత్తి వ్యయానికి తగ్గట్లుగా ధరలు పెంచకపోవడం వల్ల సంస్థకు భారీగా నష్టాలు వస్తున్నాయని యూబీఎల్‌ పేర్కొంది. అందువల్ల సరఫరా నిలిపివేశామని, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని యునైటెడ్‌ బ్రూవరీస్‌ సెబీకి పంపిన లేఖలో స్పష్టం చేసింది. మరీ దీనిపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే విషయాలు తెలియాల్సి ఉంది. మరోవైపు కింగ్​ఫిషర్ ప్రియులు ఈ నిర్ణయంతో ఆందోళన చెందుతున్నారు.

బూంబూం, బిర్యానీ కోసమేనా? : రాష్ట్ర ప్రభుత్వానికి బీర్ల అమ్మకాలు నిలిపివేయాలని యునైటెడ్ బ్రీవరీస్ తీసుకున్న నిర్ణయంపై మాజీమంత్రి హరీశ్ రావు పలు ప్రశ్నలు లేవనెత్తారు. బీర్లకు సంబంధించిన బకాయిలను బేవరేజ్ కార్పొరేషన్ చెల్లించలేదని యునైటెడ్ బ్రీవరీస్ పేర్కొందని తెలిపారు. యూబీఎల్ నిర్ణయంతో రాష్ట్రంలో కింగ్ ఫిషర్, హీనెకెన్ వంటి ప్రీమియం బ్రాండ్లు రాష్ట్ర ప్రజలకు దొరకవన్నారు. బూంబూం, బిర్యానీ వంటి స్థానిక బ్రాండ్ల బీర్లను ప్రోత్సహించేందుకు ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నమేనా? అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బిల్లుల చెల్లింపులో కూడా వరుస క్రమాన్ని కాకుండా ప్రత్యేక ప్రాధాన్యతలు పాటిస్తున్నారని, అందువల్లే ఈ పరిస్థితి తలెత్తిందా? అని హరీశ్ రావు ప్రశ్నించారు.

అయ్యా కలెక్టర్​ సార్​.. మా ఊర్లో కింగ్​ఫిషర్ బీర్లు అమ్మడం లేదంటూ ఫిర్యాదు

రాష్ట్రంలో రోజుకు 20 లక్షలకు పైగా అమ్ముడుపోతున్న బీర్లు - అయినా డిమాండ్​కు తగ్గ సప్లై లేదట - SHoratge OF Beers In Hyderabad

Last Updated : Jan 8, 2025, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.