How to Make Chicken Mulligatawny Soup: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పడిపోతున్నాయి. దీంతో చాలా మంది ఈ చలి నుంచి ఉపశమనం పొందేందుకు వేడి వేడి సూప్స్ తాగాలని ఆరాటపడుతుంటారు. అనుకున్నదే తడవుగా క్షణాల్లో సూప్స్ ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేస్తుంటారు. కాగా, చాలా మంది చేసుకునే సూప్స్‌లో టమాట, క్యారెట్, జింజర్ సూప్‌లు కామన్‌గా ఉంటాయి. అయితే వాటితో పాటు ఓసారి "చికెన్ ముల్లిగటావ్నీ సూప్" ప్రిపేర్ చేసుకోండి. పేరు కొత్తగా ఉన్నా టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. చలి నుంచి ఉపశమనం మాత్రమే కాదు, దగ్గు, జలుబు వంటి సీజనల్ సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇంకెందుకాలస్యం రుచితో పాటు శక్తినిచ్చే "చికెన్ ముల్లిగటావ్నీ సూప్" ప్రిపరేషన్ ఈ స్టోరీలో చూద్దాం..
కావలసిన పదార్థాలు:
- బటర్ - 2 టేబుల్ స్పూన్లు
- నూనె - టేబుల్ స్పూన్
- ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
- క్యారెట్ ముక్కలు - అర కప్పు
- కొత్తిమీర తరుగు- అర కప్పు
- బిర్యానీ ఆకులు - 2
- మిరియాలు - చెంచా
- మిరియాలపొడి - అర చెంచా
- కరివేపాకు - 4 రెమ్మలు
- ఎముకలు లేని చికెన్ తొడ ముక్కలు- అర కిలో
- నీళ్లు - 2 లీటర్లు
- ఉప్పు - రుచికి తగినంత
- క్రీమ్ - 50 గ్రాములు
- చిప్స్ - టేబుల్‌స్పూన్(ఆప్షనల్)
తయారీ విధానం:
- స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి పాత్ర పెట్టి చికెన్, మిరియాలు, ఉప్పు, నీళ్లు, బిర్యానీ ఆకులు, కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్‌లో నీళ్లు సగానికి అయ్యే వరకు అంటే సుమారు 20 నుంచి 30 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి.
- చల్లారిన తర్వాత వడ కట్టి.. చికెన్ ముక్కలు, నీళ్లను (చికెన్ స్టాక్) సెపరేట్ చేయాలి.
- ఇప్పుడు ఉడికిన చికెన్ ముక్కలను సన్నగా కట్ చేసి పక్కన పెట్టాలి.
- స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి వెన్న, నూనెలు వేసి వేడిచేయాలి.
- హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ, క్యారెట్ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి.
- అనంతరం అందులోకి ఉడికించి కట్ చేసిన చికెన్, చికెన్ స్టాక్, ఉప్పు, మిరియాలపొడి, కొత్తిమీర తరుగు వేసి కలిపి మూతపెట్టాలి.
- సన్నటి సెగ మీద అరగంట సేపు ఉడికించాలి.
- సూప్ చిక్కబడిన తర్వాత సర్వింగ్ బౌల్స్‌లోకి తీసి క్రీమ్, చిప్స్‌తో వేడివేడిగా ఆస్వాదిస్తే కలిగే ఫీలింగ్ వేరే లెవల్.
- నచ్చితే మీరూ ట్రై చేసి ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి.
బరువు తగ్గించే "జొన్న గుమ్మడికాయ సూప్" - ప్రిపరేషన్ చాలా ఈజీ! - బీపీ, షుగర్‌కూ చక్కటి మెడిసిన్!