తెలంగాణ

telangana

'బీరువా లోపల ఈ వస్తువులు ఉండాలి - తప్పక లక్ష్మీ కటాక్షం కలుగుతుంది' - Which Direction to Keep Wardrobe

By ETV Bharat Features Team

Published : 4 hours ago

Which Side We Put Wardrobe as per Vastu: వాస్తు ప్రకారం బీరువాలో కొన్ని వస్తువులు ఉంచడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

which direction to keep wardrobe
which direction to keep wardrobe (ETV Bharat)

Which Side We Put Wardrobe as per Vastu:ఇంట్లో బీరువాను ఉత్తరం వైపు పెట్టాలని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ సూచిస్తున్నారు. ఉత్తర దిక్కు కుబేర స్థానం కావడం వల్ల ధనవృద్ధి కలుగుతుందని చెబుతున్నారు. అయితే.. బీరువాను సరైన ప్రాంతంలో పెట్టడం మాత్రమే కాకుండా.. బీరువా లోపల కొన్ని వస్తువులు ఉంచడం వల్లనే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అంటున్నారు.

ఎర్రని వస్త్రాన్ని బీరువాలో ఉంచితే.. ధనం రావడం ఆగిపోతుందట. అందుకే ఎర్రటి వస్త్రాన్ని బీరువాలో పరచచకూడదని.. తెల్లటి కాటన్ వస్త్రాన్ని ఉంచాలని సూచించారు. ఇంకా దీనిపై అత్తరు రాసి పెడితే మరింత లాభం ఉంటుందని వివరించారు. వీలైతే బీరువాల గోడలకు కూడా అత్తరు రాయాలని చెబుతున్నారు. కలరా ఉండలు, అత్తరు రాయడం మంచిదని చెబుతున్నారు.

అలాగే బీరువాలో డబ్బులు పెట్టుకునే చోట గోవింద నామాల పుస్తకం, లక్ష్మీ అష్టోత్తకం ఉంటే మంచిదని తెలిపారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవత మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుందని వివరించారు. బీరువాలో నోట్లు, చిల్లర, బంగారం వేర్వేరుగా పెట్టుకోవాలట. ఇలా విడివిడిగా దాచిపెట్టుకుంటే లక్ష్మీ దేవత అనుగ్రహం కలుగుతుందని తెలిపారు. ఒక వెండి లేదా రాగి పాత్రలో వట్టి వేళ్లు, కర్పూరం పెడితే లక్ష్మీ అనుగ్రహం కలిగి విశేషమైన ధనలాభం వస్తుందని వివరించారు. ఇలా వీలుకాని పక్షంలో కనీసం.. కర్పూరం పెట్టినా సరిపోతుందని చెప్పారు.

ప్రతిరోజూ బీరువా తెరిచి అగరుబత్తీలు వెలిగించి చూపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని అంటున్నారు. బీరువాపైన కలువ పూవులో కూర్చుని కుడి చేతితో బంగారు నాణెలు వక్షిస్తున్న లక్ష్మీ దేవత ఫొటో అతికించాలని సూచించారు.

బీరువా మీద ఎక్కువగా బరువులు పెడితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందని చెప్పారు. ఇంకా బీరువాపై పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసి శుభం లాభం అని రాస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుందని వివరించారు. ఇలాంటి విధానాలు పాటించడం వల్ల లక్ష్మీ దేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుందని మాచిరాజు వివరించారు.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

'మీ ఇంట్లో మల్లె చెట్టు ఈ దిక్కున.. కొబ్బరి చెట్టు ఆ దిక్కున ఉండాలి - లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా?' - Vastu Tips for Trees in Home

మీ ఇంటి ముందు చెట్టు, గుడి ఉందా? - అయితే, మీకు ఈ నష్టాలు తప్పవట!! - Vastu Shastra for Main Entrance

ABOUT THE AUTHOR

...view details